ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ లాంటి ప్రైవేట్ క్విక్ కామర్స్ సంస్థల తరహాలోనే… ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం (AP) కూడా రైతుబజార్లను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. కూరగాయలు, పండ్లను digirythubazaarap.com సైట్ ద్వారా బుక్ చేసుకుంటే డెలివరీ ఛార్జీలు లేకుండానే నిమిషాల వ్యవధిలోనే హోమ్ డెలివరీ చేస్తుంది. విశాఖలో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే మిగతా రైతుబజార్లకూ విస్తరించనుంది.
Read Also: CM Chandrababu: టీమిండియాకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఆర్గానిక్ ఉత్పత్తులు లాంటి వాటిని కూడా చేర్చే అవకాశం
సైట్‌లో అందించే ఉత్పత్తులు పూర్తిగా రైతుబజార్ల నుంచే వస్తాయి కాబట్టి, నాణ్యతపై ప్రజలు నమ్మకం ఉంచవచ్చు. భవిష్యత్తులో పాలు, పూలు, పప్పుదినుసులు, ఆర్గానిక్ ఉత్పత్తులు లాంటి వాటిని కూడా చేర్చే అవకాశం ఉంది..ప్రాజెక్ట్‌ను పైలట్‌గా విశాఖలో అమలు చేసి ప్రతిస్పందన ఎలా ఉంటుందో ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఇది సక్సెస్ అయితే రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైతుబజార్లకు — విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, రాజమండ్రి, నెల్లూరు వంటి ప్రాంతాలకు కూడా ఈ డిజిటల్ సర్వీస్‌ను విస్తరించనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: