విజయవాడ :ఏపీలో మార్చి 16 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగునున్నాయి, 2025-26 విద్యాసంవత్సరంలో 6.23 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి (ssc) పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. నామినల్ రోల్, పరీక్ష ఫీజు చెల్లింపు దాదాపుగా పూర్తి కావడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం తుది జాబితాను రూపొందించింది. ఈ సంవత్సరం అత్యధికంగా కర్నూలు జిల్లా నుంచి 33,930 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఆ తర్వాత 31,979 మంది అనంతపురం జిల్లా నుంచి పరీక్షలు రాయనున్నారు. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల టైమేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.
Read also: AP Tourism: వంజంగి ప్రకృతి సౌందర్యంపై మంత్రి నారా లోకేశ్ ట్వీట్

0th class exams to be held from March 16
పరీక్షల నిర్వహణకు ఆన్లైన్ విధానం ద్వారా
పరీక్షల సమయం ఉదయ 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్ 20న ఇంగ్లీష్, 23న గణితం, 25న భౌతికశాస్త్రం, 28న జీవశాస్త్రం, 30న సాంఘికశాస్త్రం, 31. ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2), ఏప్రిల్ 1న ఓఎస్ఎస్సీ సెకెండ్ లాంగ్వేజ్ పేపర్2 పరీక్షల నిర్వహించనున్నా మొత్తం విద్యార్థుల్లో 94 మంది ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాయనున్నారు. అయితే పరీక్షలకు ఇన్విజిలేటర్ల కేటాయింపులో ప్రభుత్వ పరీక్షల విభాగం ఈ ఏడాది కొత్త మార్పు చేపట్టింది. పరీక్షల నిర్వహణకు ఆన్లైన్ విధానం ద్వారా ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ అధికారులకు పరీక్షల విధులను కేటాయించనున్నారు.
ఈ ఏడాది పదో తరగతి ప్రశ్నాపత్రంలో కొన్ని మార్పులు
ఇందుకు సంబంధించి. ఉత్తర్వులు డిజిటల్ రూపంలో లీప్ యాప్ ద్వారా సిబ్బందికి అందజేస్తారు. మూల్యాంకనంలో మార్కుల లెక్కింపులో తప్పులు లేకుండా ఉండేందుకు ఈ సారి ట్యాబ్ల ద్వారా మార్కులు నమోదు చేయడానికి సర్వం సిద్ధం చేశారు. సహాయ ఎగ్జామినర్ నమోదు చేసిన మార్కులను చీఫ్ ఎగ్జామిన్ మరోసారి పరిశీలిస్తారు. గత పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో మార్కుల నమోదులో తప్పులు, కూడికల వెలుగు చూడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలకు ఇన్విజిలేటర్ల కేటాయింపులో ప్రభుత్వ పరీక్షల విభాగం ఈ ఏడాది కొత్త మార్పులు చేపట్టింది. గత సంవత్సరంలో పోలిస్తే ఈ ఏడాది పదో తరగతి ప్రశ్నాపత్రంలో కొన్ని మార్పులు చేశారు. విద్యార్థుల సమగ్ర అభివృ. కోసం సమీక్ష, జ్ఞానం అంచనా, విశ్లేషణ (పరాఖ్) విధానంలో ఈ ఏడాది పదో తరగతి ప్రశ్నపత్రా స్వల్ప మార్పులు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: