విజయవాడ : భారత బ్యాడ్మింటన్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని కితాబు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆమె పట్టుదల యువ క్రీడాకారులకు నిత్య స్ఫూర్తి అని వెల్లడి భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ ఆట నుంచి తప్పుకోవడంపై (AP) చంద్రబాబు(CM Chandrababu) స్పందించారు. భారత క్రీడా రంగానికి ఆమె చేసిన సేవలను కొనియాడుతూ “ఎక్స్” వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. సైనా నెహ్వాల్ సాధించిన విజయాలు దేశానికే గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. “సైనా నెహ్వాల్ను చూసి మనమంతా ఎంతో గర్విస్తున్నాం. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఆమె ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. మన బ్యాడ్మింటన్ను ప్రపంచ పటంలో సగర్వంగా నిలిపిన ఘనత ఆమె సొంతం. సైనా కఠోర శ్రమ, పట్టుదల, ఆమె సాధించిన విజయాలు ఒక చెరగని ముద్ర వేశాయి. ఇవి ఎంతోమంది యువ క్రీడాకారులు రాకెట్ పట్టుకుని కోర్టులో అడుగుపెట్టేలా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
Read Also: Kishan Reddy: సామాజిక బాధ్యత, ఆర్థిక రాజకీయ, కమ్యూనిజంలో లేదు

మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను..చంద్రబాబు
బ్యాడ్మింటన్కు మీరు చేసిన సేవలకు ధన్యవాదాలు సైనా రిటైర్మెంట్ తర్వాత మీరు చేపట్టబోయే పనులు విజయవంతం కావాలని, మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను” అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. (AP) ఇదిలా ఉండగా, మోకాలి గాయాల కారణంగా ఇక ఆడలేనంటూ సైనా నెహ్వల్ పరోక్షంగా బ్యాడ్మింటన్కు గుడ్ బై చెప్పడం తెలిసిందే. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి క్రీడా దిగ్గజాలు కూడా సైనా సేవలను కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించి భారతీయ బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చిన సైనా.. తన నిర్ణయంతో అభిమానులను కాస్త నిరాశకు గురిచేసినా, భారత బ్యాడ్మింటన్ రంగంలో ఆమె ఘనమైన వారసత్వం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. సైనా నెహ్వాల్పై ప్రశంసలు జల్లు కురిపించిన లోకేష్ ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆట నుంచి వైదొలగిన సందర్భంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.
భారతీయ యువతకు స్ఫూర్తి ఇచ్చిన సైనా
భారత క్రీడా రంగానికి ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. (AP) సైనా నెహ్వాల్ నిజమైన మార్గదర్శకురాలని, భారత బ్యాడ్మింటన్ దశ దిశను మార్చిన ఘనత ఆమెకే దక్కుతుందని లోకేశ్ పేర్కొన్నారు. కేవలం తన పట్టుదల, అత్యుత్తమ ఆటతీరుతో భారత బ్యాడ్మింటన్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని మంత్రి ప్రశంసించారు. సైనా క్రీడా ప్రయాణం ఎంతోమంది భారతీయ యువతలో స్ఫూర్తి నింపిందని, పెద్ద కలలు కనేలా చేసిందని తెలిపారు. మైదానంలో భయం లేకుండా ఎలా పోటీపడాలో నేటి తర్వానికి ఆమె నేర్పించారని అన్నారు. సైనా వదిలి వెళుతున్న ఈ గొప్ప వారసత్వానికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఆమె తన తదుపరి జీవితంలోనూ మరిన్ని విజయాలు సాధించాలని, భవిష్యత్తు సాఫీగా సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు నారా లోకేశ్ తన సందేశంలో వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: