ఆంధ్రప్రదేశ్ (AP) లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వేస్ (South Central Railways) మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం నుంచి కొల్లం వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపటి నుండి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక సేవలు జనవరి 21 వరకు కొనసాగనున్నాయి.
Read Also: Library : విజ్ఞాన, సంస్కృతుల నిలయం గ్రంథాలయం

ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు ఉపశమనాన్ని
పండుగ సీజన్, సెలవులు, ఉద్యోగ ప్రయాణాలు పెరగడంతో ట్రావెల్ డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు ఉపశమనాన్ని అందించనున్నాయి.ఈ ట్రైన్స్ ప్రతి మంగళవారం విశాఖ-కొల్లం(08539), ప్రతి బుధవారం కొల్లం-విశాఖ(08540) మధ్య స్లీపర్, 2AC, 3AC బోగీలతో నడవనున్నాయి. ఇవి రాజమండ్రి, VJA, నెల్లూరు, రేణిగుంట మీదుగా వెళ్తాయి. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ కూడా అందుబాటులో ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: