ఏలూరు : జిల్లాలోని 22ఎ భూ సమస్యలలో 90శాతం పరిష్కరిస్తా రాష్ట్రంలోనే మొదటి సారిగా ఏలూరు జిల్లాలో 22ఎ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లా (Eluru district) మార్గదర్శకం అవుతుందని. జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం మెగా 22ఎ భూ సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జెసి అభిషేక్ గౌడ, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, డా. కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, ప్రభృతులు పాల్గొన్నారు.
Read also: Sreecharani: శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

Special platform set up in Eluru for the resolution of 22A cases
సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన రాజకీయ కక్షల కారణంగా రాష్ట్రంలో 22 భూ సమస్యలు అతి పెద్ద సమస్యగా రూపొందాయని, ప్రైవేట్ భూములను కూడా ఉద్దేశ్యపూర్వకంగా 22ఎ జాబితాలో చేర్చారని, గత ప్రభుత్వ నేతలకు అనుకూలంగా లేని వారి భూములను 22ఎ, చుక్కలు భూములు వంటి వివాదాస్పద భూముల జాబితాలో చేర్చారన్నారు. దీని కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ శాఖ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో అందిన ప్రతీ ఆర్జీని అధికారుల పరిశీలించి 90శాతం వరకు అదేరోజు పరిష్కరించడం జరుగుతుందన్నారు. దేవాదాయ భూములు, వంటి సమస్యలు ఉన్న భూములను సంబంధిత సమన్వయంతో 1 లేదా 2 వారాలలో తప్పనిసరిగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ, డిఆర్ వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న. ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, జిల్లా సర్వే అధికారి అన్సారీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, కలెక్టరేట్ ఏట నాంచారయ్య, జిల్లాలోని 27 మండలాల తహసీల్దార్లు, రెవిన్యూ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: