చంద్రగిరి : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పిఎం సూర్యఘర్ ముఫ్ బిజిలీ యోజన పధకం నిరుపేదలకు అందని ద్రాక్షగా మిగిలిపోతున్నది. దేశ ప్రదాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోలార్ విద్యుత్ పై అత్యంత చిత్తశుద్దితో ముందుకు వెళుతున్నారు. దేశ వ్యాప్తంగా సామాన్యులకు చెందిన కోటి గృహాలపై రూఫ్ టాప్ సోలార్ (Rooftop solar power) ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవడంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఈ పధకం వీలుకల్పించింది. అదేరీతిన ముఖ్యమంత్రి తన స్వగ్రామం తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, నారావారిపల్లిని యూనిట్ గా తీసుకుని స్వర్ణ నారావారిపల్లి కార్యక్రమం (ఆరేపల్లి రంగంపేట నుండి భీమ వరం వరకు) ద్వారా ఇంటింటికీ ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అమర్చేందుకు చర్యలు చేపట్టారు.
Read also: V Narayanan: శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్..

AP Solar Scheme
300 యూనిట్లు ఉచిత విద్యుత్ ను అందించేందుకు
ఆ మేరకు జిల్లా అధికారులు సైతం రేయింబవళ్ళు శ్రమించి దాదాపుగా లక్ష్య సాధనకు కృషి చేశారు. సూర్యఘర్ పధకంపై ప్రభుత్వ ఆలోచనను పరిశీలిస్తే పేదలకు కనీసం నెలకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్ ను అందించేందుకు ఈ పధకం దోహదపడుతుంది. ఈ పధకం ద్వారా విద్యుత్ భారాన్ని గణనీయంగా తగ్గించుకుని సౌరశక్తి వినియోగాన్ని పెంచుకోవచ్చును. ఇటువంటి బృహత్తరమైన పధకం కొరకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కలిగిన నిరు పేదలను నిబంధనల కొరఢా వేధిస్తున్నది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో గ్రామ కంఠం, డికెటికి చెందిన స్థలాలోనే ఇల్లు కట్టుకుని నివశిస్తుంటారు. ఇటువంటి వారు సోలార్ అమర్చుకోవాలంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తప్పనిసరి అంటున్నారు. అదే విధంగా గృహ యజమాని మరణించినట్లయితే కుటుంబ సభ్యులు విద్యుత్ సర్వీస్ ను మార్చుకునేందుకు సైతం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తప్పనిసరి అడుగుతున్నారు.
నిరుపేదలకు ఎదురవుతున్న ఇటువంటి సాంకేతిక సమస్యలపై
వాస్తవానికి గ్రామకంఠం స్థలానికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం వున్నప్పటికీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని లబ్దిదారులు మిన్నకుండిపోతున్నారు. దీంతో ప్రదాన మంత్రి, ముఖ్యమంత్రి సోలార్ అమర్చు కోవడంపై చేస్తున్న ప్రకటనలు క్షేత్ర స్థాయికి చేరక ఉపన్యాసాలకే పరిమితమవుతున్నట్లు నిరుపేదలు వాపోతున్నారు. ఈ విషయమై తిరుపతి జిల్లా, చంద్రగిరి విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏఏఓ) శివకుమార్ ను వివరణగా గ్రామాలలో గ్రామకంఠం, డికెటి నివాసాలకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేనందున చేయడం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఆర్థిక స్థితి కలిగిన వారు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసే పరిస్థితి లేదు. పేదలు మాత్రమే ప్రభుత్వం అందించే సబ్సిడీ కొరకు ఎదురుచూస్తారు. ఆ మేరకు ఎంతో కొంత ఆసక్తితో ముందుకు వస్తున్న నిరుపేదలకు ఎదురవుతున్న ఇటువంటి సాంకేతిక సమస్యలపై ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకోవాల్సి వున్నది. అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షలు నెరవేరగలవు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: