విజయవాడ : (AP) ప్రభుత్వ పాఠశాలల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించే లక్ష్యంతో సిక్ గదులను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ కోసం ప్రభుత్వం (Government) ఈ గదులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రాథమిక వైద్య సహాయాన్ని అందించేందుకు ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మార్చి నెల చివరి నాటికి ప్రత్యేక గదుల ఏర్పాటు చేస్తారు. వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సమగ్ర శిక్షా అభియాన్ చర్యలు చేపట్టింది. ఒక్కో ఆరోగ్య నిర్వహణ గది ఏర్పాటుకు రూ.5 లక్షల ఎస్ఎస్ఏ నిధులు పాఠశాలలో పెద్దగా ఉండే ఒక తరగతి గదిని రెండుగా విభజించి, సగం గదిని సిక్ రూమ్ గా మార్పు చేస్తారు.
Read also: AP: ఇవాళ తూర్పు గోదావరి లో పర్యటించనున్న CM చంద్రబాబు

విద్యార్థులకు ప్రాథమిక వైద్యం, మానసిక ఆరోగ్య సేవల ఏర్పాటు
(AP) రాష్ట్రంలో 629 పీఎంశ్రీ పాఠశాలల్లో మొదటిగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ సిక్ రూమ్ నిర్వహణకు పాఠశాల సిబ్బంది, ఆరోగ్య నిపుణులు, తల్లిదండ్రులతో ఆరోగ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. స్థానిక ఆసుపత్రుల సహకారంతో విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒత్తిడి, ఆందోళన లాంటి సమస్యలు పరిష్కరించేందుకు శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య కౌన్సిలర్ల సేవలు వినియోగించుకుంటారు. సబ్బుతో చేతులు కడుక్కునేందుకు స్టేషన్లు, మరుగుదొడ్లు, సురక్షిత తాగునీరు, శానిటరీ ప్యాడ్లను అందుబాటులో ఉంచుతారు. ఒక్కో ఆరోగ్య నిర్వహణ గది ఏర్పాటు కోసం రూ.5 లక్షల చొప్పున ఎస్ఎస్ఏ నిధులు విడుదల చేసింది.
పాఠశాల స్థాయిలో పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం, నెలసరి పరిశుభ్రత, అనారోగ్యాలపై అవగాహన శిబిరాలను నిర్వహిస్తారు. ఆరోగ్య విద్య పుస్తకాలు అందిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలను తయారు చేసి, అందిస్తారు. స్థానిక ఆసుపత్రులతో కలిసి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి విద్యార్థి డిజిటల్ ఆరోగ్య ప్రొఫైల్ రూపొందిస్తారు. గాయాలు, ఎలర్జీ లాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులపై మాక్ల్లులు నిర్వహిస్తారు. టెలీమెడిసిన్ హాట్రన్ ద్వారా అత్యవసర సంప్రదింపుల సౌకర్యం కల్పిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులకు బడుల్లో ప్రాథమిక వైద్యం అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: