విజయవాడ : ఏపీలో వింత జ్వరం ప్రజలను వణికిస్తుంది. కొత్త మట్టిపురుగు స్క్రబ్ టైఫస్ (scrub typhus) ద్వారా వ్యాపిస్తున్న ఈ జ్వరంతో ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏపీలో 1317 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్న రాజేశ్వరి(36) అనే మహిళ, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, స్క్రబ్ టైఫన్ సోకిందని నిర్ధారించిన వైద్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి రాష్ట్రంలో అన్ని జిల్లాలో వ్యాపిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్న ప్రజలు చిత్తూరులో 379, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123, వైఎస్సార్ కడవలో 94, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు తెలిపిన వైద్య శాఖ వ్యాధి నిర్ధారణ జరిగితే సాధారణ యాంటిబయాటిక్స్ తో ఈ వ్యాధి నయం అవుతుందని, అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read also: HomeTips: రోజువారీ పనులకు ఉపయోగపడే సులభమైన చిట్కాలు

New fevers that are causing concern!
చిన్న నల్లిలాంటి క్రిమి కాటుతో
మూడేళ్ల క్రితం ఢిల్లీ, తమిళనాడులో కనిపించిన స్క్రబ్ టైఫస్ అనే జ్వరాలు ఇప్పుడు కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మచిలీపట్నం నుంచి వచ్చే రోగుల్లో నమోదు అవుతున్నాయని అంటున్నారు కొందరు డాక్టర్లు. చాలా కాలం హై ఫీవర్, ప్లేట్ లెట్స్ పడిపోవడం వంటివి దీని లక్షణాలుగా వారు చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు వెంటనే సరైన వైద్యం తీసుకోకుంటే కొన్నిసార్లు ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉందని కృష్ణా జిల్లా నుంచి వస్తున్న కేసుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని విజయవాడకు చెందిన ఊపిరి హాస్పిటల్స్ ఎండీగా పని చేస్తున్న దీ్పు. రఘు రామ్ ఒక వీడియోలో తెలిపారు. అయితే విజయవాడ నుంచి జ్వరంతో వచ్చిన వాళ్లలో ఈ వ్యాధి ఇంత వరకూ కనిపించలేదని ఆయన అన్నారు. . మట్టిలో ఉండే చిన్న నల్లిలాంటి క్రిమి కాటుతో ఈ వ్యాధి వస్తుంది.
నిర్లక్ష్యం చేస్తే బాడీలో
చాలా కాలం ఉండడం ప్లేట్లు లెట్స్ పడిపోవడంతో ఇది “డెంగీ ” అని భ్రమ పడతారు. కానీ నిర్ణీత పరీక్షలతో ఈ వ్యాధి ని నిర్ధారించవచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. అందుకే సాధారణ జ్వరం అని ఆలస్యం చేయకుండా లక్షణాలు కనిపించగానే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందిగా వారు ప్రజలకు సూచిస్తున్నారు. ఎక్కువ కాలం జ్వరం ఉండటం, విపరీతమైన ఒంటి నొప్పులు, తలనొప్పి, కొన్ని సార్లు తలనొప్పి, ప్లేట్ లెట్స్ పడిపోవడం, క్రియాటిన్ పెరగడం సాధారణంగా శీతాకాలంలో అక్కడక్కడా ఈ వ్యాధి కనిపిస్తుందని ఎక్కువగా కొండ ప్రాంతాల్లో కనిపించే ఈ పురుగు ఇప్పుడు సిటీల్లో సైతం కనిపించడం ఆందోళన కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. మట్టిలో కలిసిపోయే ఈ పురుగు కాటు వల్ల ప్లేట్ లెట్స్ పడిపోతాయని నిర్లక్ష్యం చేస్తే బాడీలో మల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బ తినే ప్రమాదం ఉందని డాక్టర్స్ అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఈ వ్యాధి సోకితే అలాంటివారు రికవర్ కావడం కాస్త కష్టం అని డాక్టర్ రఘురామ్ అభిప్రాయపడ్డారు. ఇది అంతా ప్రజల్లో అవగాహన పెంచడం కోసమేననీ అయన అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: