ఆంధ్రప్రదేశ్ (AP) లో స్క్రబ్ టైఫస్ కేసులు కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా పెదపులుగువారిపాలెంలో నాగబాబు అనే యువకుడు స్క్రబ్ టైఫస్‌తో మరణించడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 20కి చేరింది. (AP) గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. అయితే, తాజా మరణాలకు స్క్రబ్ టైఫస్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా కారణమై ఉండవచ్చని వైద్యులు తెలిపారు.
Read Also: AP SSC: మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు.. హాజరు కానున్న 6.23లక్షల విద్యార్థులు
స్క్రబ్ టైఫస్ ఎలా వస్తుంది.. ఏం చేయాలి..
స్క్రబ్ టైఫస్ వ్యాధి నల్లిని పోలిన చిగ్గర్ మైట్ అనే కీటకం కాటు వలన వ్యాపిస్తుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కాదని వైద్యులు చెప్తున్నారు. పొలాలు, తోటలు, నదీ తీరాలు, పశువుల పాకలు, ఎలుకలు, పశువుల శరీరంపై ఈ కీటకాలు ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలాలు, తోటల్లో పనిచేసే కూలీలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

గడ్డి, పొదలు వంటి ప్రాంతాలను శుభ్రపరుచుకోవాలని.. ఇంట్లో ఎలుకలు, కీటకాలు లేకుండా చూసుకోవాలంటున్నారు. శరీరం పూర్తిగా కప్పి ఉండేలా దుస్తులు వేసుకోవాలని.. ఆరుబయట నిద్రించడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లోని పాత మంచాలు, ఫర్నిచర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని.. పరుపులు, దుప్పట్లను శుభ్రపరుచుకోవాలని సూచిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్ లక్షణాలు. .
తీవ్ర జ్వరం, నీరసం, తలనొప్పి, వణుకు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. అలాగే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లని మచ్చ ఏర్పడుతుంది. జీర్ణ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. అయితే సకాలంలో చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చని చెప్తున్నారు. ప్రాథమిక దశలోనే డాక్టర్లు సూచించిన యాంటీబయాటిక్స్ వాడితే త్వరగా కోలుకోవచ్చని చెప్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: