అన్ని తరగతులకు వేర్వేరు పాఠ్యాంశాలతో పుస్తకాలు
ప్రభుత్వం కీలక నిర్ణయం
విజయవాడ : విద్యతో పాటు నైతిక విలువలు ఉంటేనే విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదుగుతారనే వ్యక్తిత్వ వికాస నిపుణుల అభిప్రాయం. ఇందుకు అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే వారి మోరల్ ఎడ్యుకేషన్(విలువలతో కూడిన విద్య అందిం చాలనే ఆలోచన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు తగినట్లుగా పిల్లలకు విలువలతో కూడిన పుస్తకాలను పాఠ్యంశాలతో పాటు అందిస్తోంది. ప్రస్తుతం పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావం (Influence of social media) పడుతోంది. వాటి కారణంగా వారి ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
అందుకే పాఠశాల స్థాయిలోనే నైతిక విలువల పెంచేందుకు విలువల విద్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య పిల్లలకు నీతి, నిజాయతీ, సేవ, విలువలు నేర్పేవారని ప్రస్తుతం అలాంటి పరిస్థితి అన్ని చోట్లా లేదు. ఉద్యోగ, వ్యాపారాలు, అవసరాల రీత్యా వివిధ ప్రాంతా ల్లోతల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే ఉంటున్నారు.
నైతిక విలువలు తగ్గిపోతున్నాయి
ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, పని ఒత్తిడి ఇతర కారణాల వల్ల పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. ఫలితంగా వారు సోషల్ మీడియా, టీవీలకే పరిమితమవు తున్నారు. నైతిక విలువలు (Moral values) తగ్గిపోతున్నాయి. కోపం, ఆందోళన, అశాంతి నెలకొంటోంది. అందుకే పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైతిక విలువలు) చాగంటి కోటేశ్వరరావు సూచనలతో రాష్ట్ర విద్య, పరిశోధన శిక్షణ మండలి (State Council of Education, Research and Training) విలువల విద్య పుస్తకాలు రూపొందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6-10 తరగతుల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి విలువల విద్య పుస్తకాలను అందించనున్నారు.
ఆయా పాఠ్యాంశాల వీడియోలు కావాలనుకునేవారు
విద్యారంగ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు (Chaganti Koteswara Rao) సూచనలతో రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎసీసీఇఆర్టీ) ఈ పాఠ్య పుస్తకాలను రూపొందించింది. ఆరో తరగతికి తోరణాలు, ఏడో తరగతికి మనోవికాసం, ఎనిమిది, తొమ్మిది తరగతులకసూక్తి సుధ, పదో తరగతికి అమృతధార పేరుతో ఈ పుస్తకాలను తీసుకువచ్చారు. ఇవి దాదాపు 39 పేజీల వరకు ఉన్నాయి. పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ పెట్టారు. ఆయా పాఠ్యాంశాల వీడియోలు కావాలనుకునేవారు వాటిని స్కాన్ చేయవచ్చు.
ఆయా జిల్లాల విద్యా శాఖ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వాటిని పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా, డీఈవో, సుబ్బారావు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 2500 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. సుమారు రెండు లక్షల యాభై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరు నుంచి పది విద్యార్థులకు ఒక్కో పుస్తకం ఇవ్వనున్నారు. ఇప్పటికే వాటిని పాఠశాలలకు సరఫరా చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: