తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జోరుగా సాగుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లో(AP Sarpanch Elections) కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల విభజన, పునర్నిర్మాణంపై ఉన్న నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా ఎత్తివేసింది.
Read Also: AP: ఈ 3 డాక్యుమెంట్స్ ఉంటే రేషన్ కార్డు ఈజీ

రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమీక్ష
సర్పంచ్ ఎన్నికల(AP Sarpanch Elections) నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలో SEC కమిషనర్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల పదవీకాలం మార్చిలో ముగియనుండగా, గ్రామ సర్పంచ్‌ల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుండటంతో ప్రత్యేక దృష్టి సారించారు.
గ్రామ పంచాయతీలలో మార్పులకు తాత్కాలిక ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసి, గ్రామ పంచాయతీలను విభజించడం, విలీనం చేయడం, పురపాలికల్లో కలపడం వంటి మార్పులకు తాత్కాలికంగా అనుమతులు కల్పించారు. పంచాయతీల పాలకవర్గం తీర్మానాలు, లేదా ప్రత్యేక ఆఫీసర్ ఆధ్వర్యంలోని గ్రామసభల ఆమోదంతో ఈ ప్రక్రియ కొనసాగనుంది.
పంచాయతీల విభజన, విలీనం విధానం
ఒక పంచాయతీని రెండు భాగాలుగా విభజించడం, ఒక పంచాయతీలోని గ్రామాలను మరో పంచాయతీలో కలపడం, రెండు పంచాయతీలను విలీనం చేయడం లేదా వాటిని సమీప పుర/నగరపాలక సంస్థల్లో కలపడం వంటి మార్పులు ఈ ఉత్తర్వుల ద్వారా చేయవచ్చు. అయితే, ఒక మండలంలోని పంచాయతీలను వేరే మండలంలో కలపడానికి అనుమతి లేదు. ఆమోదించబడిన తీర్మానాలు జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖకు పంపి, ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదం పొందుతాయి.
కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక సంస్కరణలు చేసింది. ఇప్పటివరకు 7,244 క్లస్టర్లను తొలగించి, 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ఏర్పాటు చేసింది. ప్రతి పంచాయతీకి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాలు, ఇంజినీరింగ్, ఆదాయం, పన్ను వసూళ్ల వంటి విభాగాలు ఉండే విధంగా మార్పులు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: