ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం, విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సుపై విశేష దృష్టి పెట్టింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడుల ప్రవాహానికి ఇది మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సదస్సులో సుమారు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని సీఎంఓ (Chief Minister’s Office) ప్రకటించింది. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో అనేక ఒప్పందాలు (MoUs) కుదురుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Read Also: Lokesh Big Announcement : ఈరోజు 9 గంటలకు లోకేష్ కీలక ప్రకటన

ఈ సదస్సును ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తోంది
నవంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో 40 దేశాల నుంచి సుమారు 3,000 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సును ప్రభుత్వం అత్యంత కీలకంగా భావిస్తోంది.
‘ఇన్వెస్ట్ ఇన్ ఏపీ’ (AP) సందేశాన్ని సమ్మిట్ ద్వారా చాటి చెప్పాలని సీఎం చంద్రబాబు సంకల్పించినట్లు పేర్కొంది. కాగా ఈ సదస్సులో సీఎం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు.
వీరితో పాటు విశాఖపట్నం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ శంకర్ బ్రతా బాగ్చీ, ఇతర సీనియర్ అధికారులు పుష్పగుచ్ఛం అందించి ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: