సచివాలయం: డబుల్ ఇంజన్ సర్కార్ లక్ష్యం రాష్ట్రంలో ప్రపంచస్థాయి పెట్టుబడులు ఆకర్షణ గ్రామస్థాయి పెట్టుబడుల సాధికారతకు ప్రోత్సాహం దిశగా ఏపిలో జరుగుతుందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ తెలిపారు. బుదవారం ఆయన పేషీలో విలేకర్లుతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ద్యేయం స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారంతో ప్రధాని మోడీ సంకల్పం వికసిత్ భారత్ సాధనకు పెట్టుబడుల ఆకర్షణ కీలకం. ముఖ్యమంత్రి దార్శనికత మరియు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహకారంతో విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ముందే 11లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షణ జరిగిందన్నారు. 15 బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడులు నుంచి రూ.15వేలు పెట్టుబడుల వరకు ప్రతి ఒక్కరిని ఒకే స్ఫూర్తితో ప్రోత్సహిస్తున్నారు.
Read also: AP: ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థి ఆత్మహత్య

AP: 20 అంశాల కార్యక్రమం అమలుపై సమీక్ష: కమిటీ చైర్మన్ లంకా దినకర్
పారిశ్రామిక ఒప్పందాలు
చరిత్రలో లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకోబోతున్న అతిపెద్ద పారిశ్రామిక వేత్తల సదస్సు విశాఖలో జరగడానికి మూడు రోజులు ముందు కనిగిరి వంటి వెనుక బడిన ప్రాంతం నుండి 17 జిల్లాల్లో ని 49 చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల పార్కులను వర్చువల్ గా ప్రారంభోత్సవం చేయడం అంటే పారిశ్రామిక సదస్సు నిర్వహిస్తున్న సమయంలో సాధారణంగా పెద్ద పరిశ్రమలపైన చర్చ జరగాల్సిన తరుణంలో చిన్న పరిశ్రమల పైన అంతే ప్రాధాన్యతతో కార్యక్రమం చేయడం ఆయనకు సాధ్యం అని నిరూపించారు. ఎంఎస్ఎంఈల సభలో కనిగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ డ్వాక్ర మహిళల సాధికారత ద్వారా ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వేత్తను తయారుచేయడానికి డబుల్అంజన్ సర్కార్ పనిచేస్తుందన్నారు.
ప్రధాని మోడీ సహకారం మరువలేనిది
దేశంలో 30శాతం జిడిపి, 40శాతం ఎగుమతులు ఎంఎస్ఎంఈ ద్వారా సమకూరుతున్నాయి, ఈ శాతం ఆంద్రప్రదేశ్ లో పెంచాలనే లక్ష్యంతో డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తుంది. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లు మరియు కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు ప్రధాని మోడీ సహకారం మరువలేనిది. 2019-24 మద్య పెట్టుబడుల ఆకర్షణలో ప్రతికూల వాతావరణం ఉండడానికి కారణం నాటి ప్రభుత్వ పాలన వైఫల్యం. ఆయ పెట్టుబడుల ద్వారా 20లక్షల ఉద్యోగాలు రాబట్టడం లక్ష్యంగా ఐటి మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ సహాయ సహకారాలు గ్రామాల్లో మహిళల లక్పతి దీదీలు ద్వారా డబుల్ ఇంజన్ సర్కార్ సహకారంతో పెట్టుబడుల ఆకర్షణకు ఊతం ఇస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: