ప్రభుత్వానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజప్తి
విజయవాడ : హిందు మతంపై(AP) కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. గత రెండు దశాబ్దాల జరుగుతున్న మత మార్పిడులపై విచారణ చేయాలన్నారు. ధర్మం కోసం హిందువులంతా ఐక్యంగా ఉండాలని పిలుపును ఇచ్చారు. దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కట వ్వాలని విజయసాయిరెడ్డి విజుప్తి చేసారు. అదే భారతదేశానికి రక్ష .. శ్రీరామ రక్ష అని తెలిపారు.
Read also: మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు

విజయసాయి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ
ఈ మేరకు ఆదివారం విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy) తన ఎక్స్ ఖాతా వేదికగా హిందూ మతంపై ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ మతంపై(AP) కుట్రలు జరుగుతున్నాయన్నారు, వాటిని సహించేది లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఆశ చూపించి మతమార్పిడులకు పాల్పడే వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో, రాష్ట్రం జరుగుతున్న మతమార్పిడులపై ప్రభుత్వం ఒక కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రలోభాలకు గురిచేసి మతాలను మార్చే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సాయిరెడ్డి తాజా ట్వీట్పై రాజకీయవర్గాల్లో చర్చకు తెర తీసింది. ఏదో ఒక పార్టీలో చేరే ఉద్దేశ్యంతోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: