నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు
సచివాలయం: దార్శనికుడైన చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేస్తున్న కాలంలోనే రాయలసీమకు జీవనాడిలా ఉన్న ప్రతి నీటి వనరుకీ పునాది వేయడం జరిగిందని, తద్వారా కరువు సీమ సస్యశ్యామల రత్నాల సీమగా మారిందని రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతానికి సాగునీటి రూపంలో కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారా శాశ్వత పరిష్కారాన్ని చూపిన నాయకుడు నందమూరి తారకరామారావు అన్నారు.
Read also: Tirupati: గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
1983లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన రాయలసీమ కరువును నివారించేందుకు సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యమని గుర్తించి, దూరదృష్టితో తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగోడు బ్యాలెన్సర్, గోరకల్లు, అవుకు, గండికోట వంటి అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆ మార్గంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టులను విస్తరించి, రాయలసీమ సాగునీటి కలను సాకారం చేసే దిశగా అహర్నిశలు కృషి చేశారన్నారు.
నేడు రాయలసీమలో ఏ ప్రాజెక్ట్, రిజర్వాయర్ పేరు పలికినా ప్రజలకు గుర్తుకువచ్చేది ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమకు జీవనాడిలా మారిన ప్రతి నీటి వనరుకీ వీరిద్దరి ప్రణాళిక, పట్టుదల, పరిపాలనా దక్షతే పునాది అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సాగునీటి ప్రాజెక్టులపై చూపిన ప్రత్యేక శ్రద్ద కారణంగా రాయలసీమలోని జలాశయాలు, చెరువులు అన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయన్నారు.

పంపులు సిద్ధం
హంద్రీ-నీవా ప్రాజెక్ట్, రాయలసీమకు జీవనాడిగా పరిగణించదగ్గదని, 2019 నాటికే 3850 క్యూసెక్కుల సామర్థం గల పంపులు సిద్ధంగా ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ పాలనలో ఆ పంపులను వినియోగించకపోవడం వల్ల రాయలసీమ రైతులపై ద్రోహం చేయడం జరిగిందన్నారు. గత ఐదు సంవత్సరాల పాలనలో హంద్రీ-నివాకు కేవలం రూ.514 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం ఒక సంవత్సరంలోనే రూ.3880 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
అదేవిధంగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరన్నర కాలంలో 5.3145 5 అదనంగా వెచ్చించి కృష్ణమ్మ నీరు కుప్పం బ్రాంచ్ కెనాల్ చివరి మైలు వరకు, అలాగే మడకసిర బ్రాంచ్ కెనాల్ (490 కి.మీ) వరకు ప్రవహించేలా చేసి, రాయలసీమ రైతుల కలలను నెరవేర్చడం జరిగిందన్నారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్, అవుకు
రిజర్వాయర్ వంటి ప్రాజెక్టులు గత ప్రభుత్వ పాలనలో నిరక్ష్యానికి గురయ్యాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వీటిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
చారిత్రాత్మక మార్పు
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల భద్రతా పరిరక్షణ దిశగా కూటమి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందని, తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయినప్పుడు కేవలం ఐదు రోజుల్లో కొత్త స్టాప్లక్ గేట్ అమర్చడం, శ్రీశైలం ప్రాజెక్ట్ ప్లంజ్పూల్ మరమ్మతులకు రూ.203 కోట్లు కేటాయించడం అనేది తమ ప్రభుత్వం చురుకుదనం, బాధ్యతాయుత పరిపాలనకు సంకేతాలు అన్నారు. ఈ విధంగా రాయలసీమలోని ప్రతి సాగునీటి ప్రాజెక్ట్, రిజర్వాయర్ పునరుద్దరించబడుచున్నాయని, చెరువులు, ట్యాంకులు నిండిపోతున్నాయన్నారు.
రైతులు రెండో పంట కూడా సాగు చేయగలుగుతున్నారన్నారు. ఇది రాయలసీమ రైతుల జీవితాల్లో నీటి రూపంలో పునర్జీవాన్ని నింపిన చారిత్రాత్మక మార్పుగా నిలిచిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులు చేస్తున్న అసత్య ప్రచారాంలో ఏమాత్రం పసలేదని, వారి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మరని మంత్రి (Minister Nimmala Ramanaidu) పేర్కొన్నారు.
అలాగే గోదావరి వరద జలాల (ప్రతీ సంవత్సరం 3,000-4,000 టీఎంసీలు) వినియోగానికి పోలవరం- బొల్లాపల్లి- కృష్ణ లింక్ ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. బొల్లాపల్లి రిజర్వాయర్ (178 టీఎంసీ సామర్థ్యం) ద్వారా రాయలసీమ, బనకచర్ల, నల్లమలసాగర్ ప్రాంతాలకు నీరు అందించాలన్నది ప్రభుత్వ దృక్పథం అన్నారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ సలహాదారులు ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: