విజయనగరం : విజయనగరం జిల్లా గరివిడి పోలీసు స్టేషనులో 2019 సం.లో నమోదైన అత్యాచారం (Rape) కేసులో నిందితుడు గరివిడి మండలం, బొండపల్లి గ్రామంకు చెందిన సవిరిగాన సూర్యనారాయణ (45)కు విజయ నగరం 5వ ఎడిజె కం మహిళా కోర్ట్ న్యాయమూర్తి ఎన్. పద్మావతి 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2,000లు జరిమానా విదిస్తూ నవంబర్ 24న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా, గరివిడి మండలం, బొండపల్లి గ్రామంకు చెందిన ఒక మహిళ 19 -09-2019దిన తన పశువులశాలలో పశువులకు మేత వేస్తుండగా అదే గ్రామానికి చెందిన సవిరిగాన సూర్య నారాయణ, (45) వెనుక నుండి వచ్చి ఆ మహిళను అత్యాచారం చేశాడన్నారు. ఈ విషయమై సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి గరివిడి పోలీసు స్టేషను ఎస్ఐ కే. కృష్ణప్రసాద్ 20-09-2019న కేసు నమోదు చేసారన్నారు.
Read also: TTD: తిరుమలలో భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 24 గంటల సమయం

Rape case: Vizianagaram court sentences accused to 12 years in jail
12 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2,000లు జరిమానా
అనంతరం, అప్పటి చీపురుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సి. హెచ్. రాజుల నాయుడు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. నిందితుడు సవిరిగాన సూర్య నారాయణ(45)పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం 5వ ఎడిజె కం మహిళా కోర్ట్ న్యాయమూర్తి ఎన్.పద్మావతి 12 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2,000లు జరిమానా విధిస్తూ నవంబర్ 24న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసులు తరుపున ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించారన్నారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్థవంతంగా పని చేసిన చీపురుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరరావు, గరివిడి ఎస్ఐ బి.లోకేశ్వరరావు, సిఎంఎస్ ఎఎస్ఐ పి.మల్లేశ్వరరావు, కోర్టు కానిస్టేబులు జి.ఎల్. నాయుడు, పిపి జి. సత్యం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: