ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు, తుఫానుల ప్రభావం తక్కువ నుంచి మోస్తరు స్థాయిలో కనిపించే అవకాశం ఉంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తాజా సూచనల ప్రకారం, అల్పపీడనం, ద్రోణి ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఒక్క రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొంది.
APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ (Managing Director Prakhar Jain) ప్రకటనలో, ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా, వర్షం సమయంలో సురక్షిత ప్రదేశాలలో ఉండాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద నిలబడడం, ఖాళీ ప్రదేశాల్లో లేదా ఎత్తైన ప్రదేశాలలో ఉండటం ప్రమాదకరమని హెచ్చరించారు. వర్షం, ఉరుములు,మెరుపులు ఒకే సమయంలో వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు
సోమవారం నాడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో (thunderbolts) కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడవచ్చని పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు. అత్యధికంగా గుంటూరు (Guntur) లో 81 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పల్నాడు జిల్లా తుర్లపాడులో 54.5 మి.మీ, పెద్దకూరపాడులో 40.2 మి.మీ, గుంటూరు జిల్లా వంగిపురంలో 39.5 మి.మీ, కోనసీమ జిల్లా ముక్కామలలో 39 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు గణాంకాలను వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: