ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మళ్లీ వర్షాల దాడి తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ హెచ్చరిక కేంద్రం తాజా అంచనాల ప్రకారం రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి జల్లులు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Chandrababu Naidu : ‘సూపర్-6’ చర్చలో వివాదాస్పద వ్యాఖ్య
గురువారం విశాఖపట్నం (Visakhapatnam) లో మాట్లాడిన ఆయన.. దక్షిణ ఒడిశా నుంచి ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వివరించారు. ఇది ఉత్తర, మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల వరకు అనుకొని ఉందని వెల్లడించారు. అయితే ఈ ఉపరితల ఆవర్తనం.. రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఇక ఈ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.. శుక్రవారానికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని జగన్నాథ్ కుమార్ పేర్కొన్నారు. ఆ తర్వాత శనివారం రోజున దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు
వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. ఈ వాయుగుండం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.మరోవైపు.. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద నీరు పోటెత్తడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వారికి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
ఇక విజయవాడ (Vijayawada) లోని ప్రకాశం బ్యారేజీ వద్ద సైతం కృష్ణమ్మ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదీ సమీపంలోని స్నాన ఘాట్ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఇక తెలంగాణలోనూ భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో గురువారం, శుక్రవారం భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: