ఆంధ్రప్రదేశ్ (AP) లో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా వేసింది.రాష్ట్రంలో తేమగాలుల ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని సంస్థ తన నివేదికలో పేర్కొంది.
Read Also: Rain Alert: ప్రకాశం బ్యారేజ్ కు పోటెత్తిన వరద.. పరిశీలించిన మంత్రి నిమ్మల

మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అటు ప్రకాశం బ్యారేజీ (Prakasham Barrage) వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా, కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఈదురుగాలులు కూడా సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: