ప్రస్తుతం వర్షాలు చాలా ఎక్కువగా కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వస్తున్నట్లు, వాతావరణశాఖ తెలిపింది. దీనికి సంబంధించి సుమారు 24 నుంచి 48 గంటల వరకు గాలి దిశ మారుతూ ఉండే అవకాశముందని, ఇది ఆంద్ర్ప్రదేశ్ పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఈ వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలలు తీవ్రమైన స్థాయికి చేరుకోవచ్చని, తీర ప్రాంతాల ప్రజలు అలాగే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత (Minister Anita) అత్యవసరంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. వాయుగుండం యొక్క మారుతున్న దిశ, వర్షాల తీవ్రత, తీర ప్రాంతాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.
ప్రభావిత ప్రాంతాలను
విపత్తు నిర్వహణ శాఖ ఎండీ శ్రీ ప్రఖార్ జైన్ గారు, ఇతర అధికారులతో కలిసి ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ పరిస్థితులను పరిశీలించాము.సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో తీరం దాటే అవకాశముంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేయడం జరిగింది. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖ (Panchayat Raj Department) లతో సమన్వయం చేసుకొని గండ్లు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అవసరమైన ఏర్పాటు చేయాలని ఆదేశించాము. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ లో 112, 1070, 1800-4250101 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలను కోరుతున్నాము’ అని హోంమంత్రి అనిత కూడా ట్వీట్ చేశారు.

అధికారులు సూచిస్తున్నారు
మొత్తంగా చూస్తే, ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తత అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం సైతం ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది.ఇదిలా ఉంటే, విజయవాడ సింగ్ నగర్‌లో మళ్లీ వరదలు వస్తున్నాయి అప్రమత్తంగా ఉండండి అని కొందరు వదంతులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (AP Disaster Management Authority) స్పందించింది. ‘ఇలాంటి వదంతులను నమ్మకండి. ఇలాంటి వాటిని ప్రచారం చేయకండి. విపత్తుల నిర్వహణ సంస్థలో 24గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ 112, 1070, 18004250101 నెంబర్లను సంప్రదించి అసత్య ప్రచారాలను ఆపవచ్చు.ఎటువంటి భారీ వర్షాలు,వరదలు,తుపానులు ఇతర ఏ విపత్తులైన #APSDMA అకౌంట్ నుంచి అప్డేట్స్ వస్తాయి’ అని తెలిపారు.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సూచిస్తున్నారు.
వర్షం వల్ల కలిగే మూడు ప్రయోజనాలు ఏమిటి?
వ్యవసాయానికి ఉపయోగకరం, భూగర్భ జలాల నింపుదల,పర్యావరణ సమతుల్యత.
వర్షం 100% నీరేనా?
కాదు, వర్షం 100% నీరు కాదు. వాస్తవానికి వర్షపు నీటిలో నీటి తో పాటు మరికొన్ని ఇతర పదార్థాలు కూడా కలిసివుంటాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Nara Lokesh: అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారానికి హాజరైన లోకేష్