ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గోదావరి పుష్కరాలకు సంబంధించి అధికారిక నివేదికను ప్రభుత్వానికి పంపి, 2027లో పుష్కరాలను జూన్ 26 నుండి జులై 7 వరకు నిర్వహించాలని ముహుర్తం ఖరారు చేసింది. ఈ పుష్కరాలకు 7–8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పుష్కరాల (pushkaram) నిర్వహణకు రూ.5,704 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు కూడా సిద్ధం అయ్యాయి.
Read also: Tirumala: తిరుమల..సర్వదర్శనానికి 15 గంటల సమయం

AP Pushkaralu
రైల్వే ప్రత్యేక సేవలు
పుష్కరాల ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల కమిటీ, వివిధ శాఖల కార్యదర్శులు, ఆగమ, వైదిక పండితులు పుష్కరాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భక్తుల రద్దీ నియంత్రణ, స్నాన ఘాట్ల నిర్వహణ, రైల్వే ప్రత్యేక సేవలు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
పూర్వపు పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు కనీసం రెండు రోజుల పాటు జిల్లాల్లో ఉండేలా, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేలా సమన్వయం చేపడతామని అధికారులు తెలిపారు. నిడవదోలు, గోదావరి, కొవ్వూరు స్టేషన్లలో రద్దీ తగినంతగా నిర్వహించడానికి వసతులు ఏర్పాటు చేయనున్నట్లు కూడా చెప్పారు.
గోదావరి పుష్కరాలు ఎప్పుడు జరుగతాయి?
2027 జూన్ 26 నుండి జులై 7 వరకు.
ఈ పుష్కరాలకు భక్తుల అంచనా ఎంత?
సుమారు 7–8 కోట్ల మంది భక్తులు పాల్గొననున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: