हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: AP: రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు: నాదెండ్ల మనోహర్

Rajitha
News Telugu: AP: రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు: నాదెండ్ల మనోహర్

విజయవాడ : రైతులకు రూపాయి నష్టం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. గురువారం మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని.. అయినా వైసీపీ నేతలు అన్యాయంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.1674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వైసీపీ నేతలా రైతుల పక్షాన మాట్లాడేది అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు 8 లక్షల 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. కృష్ణా జిల్లాలో లక్షా 7 వేల టన్నుల ధాన్యం సేకరించడం రికార్డ్ అని తెలిపారు. గోదావరి జిల్లాల నుంచి లక్ష టన్నుల పైనే ధాన్యం సేకరించామని చెప్పారు. అధికారులు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారని.. వారి మనోధైర్యం దెబ్బ తీసేలా వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: AP-Paddy: ధాన్యానికి న్యాయమైన ధర—ప్రభుత్వ హామీ

Purchase of grain without loss of rupee

Purchase of grain without loss of rupee

7 కోట్ల 53 లక్షల గోనె సంచులను

వైసీపీ ప్రభుత్వంలో కృష్ణా జిల్లాలో 202223 ఖరీఫ్ లో కేవలం 13వేల 560 మెట్రిక్ టన్నులు ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని.. 202324లో 16 వేల 978 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారని తెలిపారు. తాము మాత్రం లక్షా 7 వేల 960 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని చెప్పుకొచ్చారు. ఖరీఫ్, రబీలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో ట్రాన్స్ పోర్టు వాహనాల బకాయిలు నేడు రూ.9 కోట్లు చెల్లించామని మంత్రి చెప్పారు. 7 కోట్ల 53 లక్షల గోనె సంచులను ఏర్పాటు చేశామన్నారు. సీఎం సూచనలతో లక్ష సంచులు అదనంగా సిద్ధంగా ఉంచామని తెలిపారు. మూడు నెలల్లో జరగాల్సిన ప్రక్రియ.. వాతవరణంలో వచ్చిన మార్పులతో ముందే ధాన్యం సేకరించామని చెప్పుకొచ్చారు. రైతుల ఆందోళనను గుర్తించి.. ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందన్నారు. రైతులు కూడా అర్థం చేసుకోవాలన్నారు.

1792 రూపాయల మద్దతు

ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనలు, ప్రోత్సాహం వల్లే అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కొంతమంది మాఫియాగా ఏర్పడి రైతులను ఇబ్బందులు పెట్టడానికి వారి స్వలాభం కోసం డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తాము పూర్తి పారదర్శకత కోసం వాహనాలకు జీపీయస్ ఏర్పాటు చేస్తే.. దళారులు రైతులను మాయ మాటలతో మోసం చేస్తున్నారన్నారు. 75 కిలోల బస్తాకు 1792 రూపాయల మద్దతు ధర తాము ఇస్తామని ప్రకటిచాంరు. 30 వ తేదీ వరకు ఏపీలో వర్షాలు లేవని.. ఆ తర్వాత ఐదు జిల్లాల్లో వర్ష సూచనలు ఉన్నాయన్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఒకటో తేదీ నుంచి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దళారులు చేసే మోసాలు నమ్మవద్దని.. వారిని తరిమికొట్టాలని రైతులను కోరారు. 24 వేల ట్రక్స్.. ధాన్యం తరలింపుకు జీపీయస్తోతో సిద్ధంగా ఉన్నాయన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870