- మహిళా చిరుద్యోగుల పై అధికారి లైంగిక వేధింపులే కారణం
- పులివెందుల మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్ గా సురేష్ బాబు బాధ్యతలు స్వీకరణ
పులివెందుల(AP) మున్సిపల్ కమిషనర్ రాముడుకు శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. సీడీఎమ్ఏ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని సోమవారం ఆదేశాలు రావడంతో కమిషనర్ రాముడు బయలుదేరి వెళ్లారు. పులివెందుల ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా డీఈసీ సురేశ్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ రాముడుపై వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Read Also: Bommanahal MPP election : నాటకీయంగా బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక | టీడీపీ కైవసం
పులివెందుల పురపాలిక కార్యాలయంలో అధికారి అకృత్యాలు :
పులివెందుల మున్సిపల్(AP) కార్యాలయంలో పారిశుధ్య విభాగం లో పనిచేసే పలు చిరు ఉద్యోగులపై మున్సిపల్ కమిషనర్ రాముడు వేధింపులు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ కార్యాలయంతోపాటు ఇంట్లో కూడా క్లీనింగ్ పనులు చేయాలని హుకుం జారీ చేసిన అధికారి. ఇంటికి పోతే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ మహిళా ఉద్యోగులు ఆరోపించారు. ఆయన మాట వినకపోతే సమావేశం నెపంతో అనేకమార్లు తన కార్యాలయం కు రప్పించుకొని దాదాపు పలువురు మహిళా సచివాలయ సిబ్బందికి సైతం వేదింపులకు పాల్పడ్డారని సమాచారం. కనీసం కూర్చోబెట్టకుండా మీటింగ్ మొత్తం నిలబెట్టేవారని వారు ఆరోపించారు.
దీనిపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విచారణ చేపట్టి అధికారిపై చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగుల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మున్సిపల్ కమిషనర్ రాముడుపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. పులివెందుల ఇంచార్జ్ కమిషనర్ గా సురేష్ బాబు
పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడుపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడంతో ఆయన స్థానంలో మునిసిపల్ ఇంచార్జ్ కమిషనర్ గా సురేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ తాత్కాలికంగా నన్ను ఇంచార్జ్ కమిషనర్ గా నియమించడం జరిగిందన్నారు. కొత్త కమిషనర్ వచ్చేవరకు బాధ్యతలు నిర్వహిస్తానన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: