ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు 200 చొప్పున కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట కలిగించింది. ఇకపై పింఛన్ల మంజూరుపై ఇంఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకుంటారు. గతంలో నిర్ణయాధికారం లేక అర్హులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ మార్పు తీసుకొచ్చారు.
Read also: AP: రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్ పర్యటన..

AP
అర్హులు ఎవరు?
- దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
- క్యాన్సర్ రోగులు
- దివ్యాంగులు
పీజీఆర్‌ఎస్‌కు వచ్చే దరఖాస్తులను మానవీయంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సీఎం ప్రశంసలు
కలెక్టర్ల సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అలాగే తిరుపతి జిల్లాకు సుమారు రూ.96 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటితో భారీగా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అధికారులు తెలిపారు.
దరఖాస్తు
అర్హులు గ్రామ/వార్డు సచివాలయం లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా అవసరమైన ధ్రువపత్రాలతో పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: