ఏపీ (AP) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఢిల్లీలోని రైల్‌భవన్‌లో కలిశారు. పిఠాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్‌స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ)తో పాటు పలు అంశాలను వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. పిఠాపురం ఆధ్యాత్మిక ప్రాంతమని అక్కడి రైల్వేస్టేషన్‌ను అమృత్ పథకం కింద చేర్చి ఆదర్శ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దాలని రిక్వెస్ట్ చేశారు.
Read Also: AP: రైతులకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరి.. లేకపోతే ఇబ్బందే!

ఢిల్లీ పర్యటనలో రైల్వేపై ప్రధాన హామీలు
అష్టాదశ శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభస్వామి కొలువైన ఈ పవిత్ర క్షేత్రానికి దేశవిదేశాల నుంచి భక్తులు వస్తుంటారని వారి సౌకర్యార్థం మెరుగైన మౌలిక వసతులు కల్పించాలన్నారు. సేతు బంధన్ పథకం రోడ్డు ఓవర్ బ్రిడ్జిని ఇప్పటికే మంజూరు చేశారని దీనిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని పవన్ కోరారు. (AP) పిఠాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలనే తన విజ్ఞప్తికి కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని పవన్ తెలిపారు. తన ప్రతిపాదనలన్నింటినీ రైల్వేమంత్రి పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.
పిఠాపురంలో రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఇటీవల స్థానికులతో మాట్లాడుతూ ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో రైల్వేశాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్‌ను కలిశారు. సేతు బంధన్ పథకం కింద ఇదివరకు మంజూరైన పిఠాపురం ఆర్వోబీ పనులను, ప్రధానమంత్రి గతిశక్తి పథకంలోకి మార్చాలని ఆయన మంత్రిని కోరారు. ఈ పనులను పీఎం గతిశక్తి పథకంలో చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఫోకస్ పెట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: