हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP: తుపాను ప్రభావిత జిల్లాల్లో నేటి నుంచే నవంబర్ కోటా రేషన్

Aanusha
Latest News: AP: తుపాను ప్రభావిత జిల్లాల్లో నేటి నుంచే నవంబర్ కోటా రేషన్

తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రేషన్ సరుకుల పంపిణీ (Distribution of ration goods) ని ఈసారి ముందుగానే – అక్టోబర్ 28వ తేదీ నుంచే ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా తుపాను ప్రభావిత జిల్లాల ప్రజలకు ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.

Read Also: Mega job Mela: ఏపీ లో రేపు మెగా జాబ్ మేళా

ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) ఆదేశాలు జారీ చేశారు.తుపాను కారణంగా ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచే రేషన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ జిల్లాల పరిధిలోని 14,145 రేషన్ దుకాణాల ద్వారా దాదాపు 7 లక్షల మంది లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు.

AP
AP

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “సాధారణంగా నెల మొదటి రోజు నుంచి రేషన్ పంపిణీ చేస్తాం. కానీ, తుపాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. లబ్ధిదారులకు అందించే బియ్యం, పంచదార వంటి సరుకులను ఇప్పటికే క్షేత్రస్థాయిలోని రేషన్ షాపులకు చేర్చాం.

ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది” అని భరోసా ఇచ్చారు. తుపాను తీరం దాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని ఆయన కోరారు. 

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870