ఆంధ్రప్రదేశ్ (AP) లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీని అభివృద్ధి కోసం కేంద్రం నుంచి భారీగా నిధులు రాబడుతోంది. అలానే ఇక్కడ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చేయడం కోసం కీలక సంస్కరణలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా, ఈ నెల 28న ఒకేసారి 25 బ్యాంకుల భవన నిర్మాణాలకు భూమి పూజ జరగనుంది.
Read Also: Nandyal Road Accident : నంద్యాల జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం..ఇద్దరు మృతి
ఒకే వేదికపై నుంచి పునాది రాయి
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారు.అమరావతిలోని సీఆర్‌డీఏ (CRDA) ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సహా మొత్తం 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన నూతన భవనాలు, అధికారుల నివాస సముదాయాలకు ఒకే వేదికపై నుంచి పునాది రాయి వేయనుండటం విశేషం.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారాయణ, నారా లోకేశ్ తదితరులు హాజరుకానున్నారు.రాజధానిని ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా, సీఆర్‌డీఏ ఇప్పటికే ఈ బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది.
ఒకే రోజున ఇన్ని బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన చేయడం ద్వారా అమరావతి అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అమరావతి భవిష్యత్తుపై పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: