విజయవాడ : గంజాయి(AP) మాఫియాకు ఎదురు నిలిచిన పెంచలయ్యను హత్య చేసిన హంత కులను, వారికి అండ దండలిచ్చి ప్రోత్సహించిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీని వాసరావు డిమాండ్ చేసారు. గంజాయిపై పోరాటంలో హత్య చేయ బడిన కుటుంబాన్ని పరామర్శించి వారికి అన్ని విధాలా పునరావాస చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీని వాసరావు హోం మంత్రి వంగలపూడి అనితకు(Vangalapudi Anitha) లేఖ రాశారు. “గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు మీరు పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. కానీ గంజాయి ముఠా చేసిన ఈ హత్యపై మీరు కనీసం స్పందించలేదు. మాట మాత్రంగా కూడా ఖండించ లేదు. గంజాయిపై పోరాడే వారికి మీరు ఎలా భరోసా ఇవ్వగలరు? ఇప్పటికైనా ఆ గంజాయి మాఫియాకు బలైన యువకుడి కుటుంబాన్ని మీరు సందర్శించి, ఆ కుటుంబానికి భరోసా కల్పించా లని కోరుతున్నాను. వారిది అత్యంత నిరుపేద దళిత కుటుంబం.
Read also: 2027 జూన్ 26 నుంచిగోదావరి పుష్కరాలు

పెంచలయ్య కుటుంబానికి సహాయం, డ్రగ్స్ మాఫియా పై చర్యలు
పెంచలయ్య(AP) భార్యతో పాటు ఇద్దరు చదువుకుంటున్న పిల్లలున్నారు. ఆ కుటుంబానికి కనీసం రూ.50 లక్షల సహాయం, ఆరు ఎకరాల భూమి, ఒక ఇల్లు శాంక్షన్ చేయాలి. ఆయన భార్య దుర్గకి ఉద్యోగం కల్పించాలి. ఇద్దరి పిల్లల చదువుకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ మేరకు మీ నుండి ప్రకటన వస్తుందని, ఇప్పటికైనా వెంటనే ఆ కుటుంబాన్ని సందర్శించి వారికి భరోసా కల్పిస్తారని ఆశిస్తున్నాను. డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు త్రికరణ శుద్ధితో తగిన చర్యలు చేపట్టాలి. డ్రగ్స్ మాఫియాపై పోరాడే ప్రజలకు బాసటగా మీ ప్రభుత్వం నిలబడాలని కోరుతున్నాను” అని శ్రీనివాసరావు ఆ లేఖలో పేర్కొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: