AP News: శుక్రవారం ఉదయం బనగానపల్లె(Banganapalle)ఓం శాంతి సమీపంలోని ఓ నివాస గృహంలో అకస్మాత్తుగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో అమర్చిన వాటర్ హీటర్ ఒక్కసారిగా పేలడంతో ఎలక్ట్రికల్ వైర్లు షార్ట్ సర్క్యూట్‌కు గురై మంటలు చెలరేగాయి. పేలుడు శబ్దంతో చుట్టుపక్కలవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటన సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పరిస్థితిని గమనించి వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వారి సమయోచిత చర్యలతో మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించకుండా నిలువరించగలిగారు.
స్థానికులు అప్రమత్తంగా స్పందించి విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, వాటర్ హీటర్‌తో పాటు ఇంట్లోని కొంత ఎలక్ట్రికల్ సామగ్రి దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: