ముదినేపల్లి: ధాన్యం సేకరించిన గంటలలోనే రైతుల ఖాతాలో సొమ్ము. తమది రైతు ప్రభుత్వమని విత్తనం నుండి విక్రయం వరకు అన్ని విధాలా రైతు వెన్నంటి ఉండి భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫ రాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) చెప్పారు. ముదినేపల్లిలో పచ్చని పొలాల మధ్య పండగ వాతావరణంలో బుధవారం జరిగిన అన్నదాతా సుఖీభవ.. పీఎం కిసాన్ పధకం రెండవ విడత కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి నమూనా చెక్కును మంత్రి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో అన్నదాతా సుఖీభవ, పిఎం కిసాన్ పధకం రెండవ విడతలో 1,60,968 మంది రైతుల ఖాతాలకు రూ. 106.23 కోట్లు జమచేశామన్నారు.
Read also: AP: అమెరికాలో మహిళ హత్య..నిందితుడిని గుర్తించిన పోలీసులు

Money in farmers’ accounts within hours of grain collection
నష్టపోయిన ప్రతీ రైతును
అన్నదాతా సుఖీభవ, పిఎం కిసాన్ పధకంలో సంవత్సరానికి రూ.20 వేలు మూడు విడతలుగా అందించడం జరుగుతుందని, దీనిలో రూ.14 వేలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, 6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా చేసేందుకు పంటలను ఉద్యానవనంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. మొంథా తుపాన్ కారణంగా జిల్లాలో జరిగిన పంట నష్టాలను కేంద్ర బృందం పరిశీలించింది, నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్మెందుకు వాట్సాప్ ద్వారా తమ దగ్గరలోని రైస్ మిల్లులు తెలుసుకోవడం, రైతుకు అనువైన మిల్లులో అమ్మడం వంటి వెసులుబాటు కల్పించామన్నారు.
50 శాతం సబ్సిడీపై అందించామని
ప్రస్తుత వ్యవసాయ సీజన్లల్లో రాష్ట్రంలోని 4 వేల రైతు సేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు 16 వేల మందిని సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. గత వ్యవసాయ సీజన్లో రైతులకు 50 వేల టార్పాలిన్లు 50 శాతం సబ్సిడీపై అందించామని, ప్రస్తుతం రైతులకు పూర్తి సబ్సిడీతో టార్పాలిన్లు అందిస్తున్నామని, వీటిలో కౌలు రైతులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగానే తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. అభిషేక్ గౌడ, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాష, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మూర్తి, ఉద్యానవన శాఖాధికారి షాజా నాయక్, రైతు సంఘాల నాయకులు, ప్రభృతులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: