ఆంధ్రప్రదేశ్(AP) విద్యాశాఖ ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలకు కనీస గౌరవం కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందని పేర్కొంది.
Read Also: HPCL: విశాఖ రిఫైనరీలో ముందడుగు: సిఎం చంద్రబాబు

రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ పీడీపై సుమోటో కోర్టు ధిక్కరణ
విద్యాశాఖలో జరుగుతున్న పరిణామాలపై అనుమానం వ్యక్తం చేసిన హైకోర్టు, రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ (SSA) ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావుపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. ఫిబ్రవరి 4న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహారాన్ని విచారించిన జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మలతో కూడిన ధర్మాసనం, విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభావశీలుల కింద పనిచేస్తున్నామన్న ధైర్యంతో తమను ఎవ్వరూ ఏమీ చేయలేరన్న భావన అధికారుల్లో కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుతో ఘర్షణకు దిగాలనుకుంటున్నారా? అని ప్రశ్నించింది.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల కేసు నేపథ్యం
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో(AP) పార్ట్‌టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను మధ్యలోనే తొలగించడాన్ని సవాల్ చేస్తూ 2023లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సింగిల్ జడ్జ్ బెంచ్ వారిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తీర్పుపై అధికారులు అప్పీల్ చేసినప్పటికీ, కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని గత విచారణలో ప్రభుత్వ న్యాయవాది హామీ ఇచ్చారు.
హామీకి విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్ల ఆరోపణ
అయితే ఆ హామీకి విరుద్ధంగా విజయనగరం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారని పిటిషనర్లు కోర్టుకు తెలియజేశారు. ఉపాధ్యాయులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో పాటు, నిర్దిష్ట వేతనం ఇవ్వకుండా గంటల ప్రాతిపదికన జీతం లెక్కగట్టారని ఆరోపించారు. దీనిపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
విజయనగరం పీడీ చర్యలకు రాష్ట్ర స్థాయి పీడీని బాధ్యుడిని చేయడం సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, ఉన్నతాధికారులు కేవలం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, వాటి అమలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా వారిదేనని స్పష్టం చేసింది. అందుకే కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: