థాయిలాండ్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ (AP) లోని నెల్లూరు వాసి నవీన్ కుమార్ కు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కృషిచేస్తున్నారు. ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవి ,ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ కుమార్ లకు సమాచారం అందించి అండగా నిలవాలని కోరారు .
Read also: AP: ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

అస్వస్థకు గురై కుప్పకూలిపోయాడు
నెల్లూరు సిటీ మూడోడివిజన్ మైపాడుగేట్ సెంటర్ కు చెందిన మద్దూరు సుబ్బారావు కొడుకు మద్దూరు నవీన్ కుమార్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడే ఉంటూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అక్కడనుంచి థాయిలాండ్ వెళ్లిన నవీన్ కుమార్ అస్వస్థకు గురై కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన నవీన్ కుమార్ ను స్నేహితులు ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.
ఐసీయూ లో చికిత్స పొందుతున్న నవీన్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పటంతో నెల్లూరు లోని కుటుంబసభ్యులకు స్నేహితులు సమాచారం అందించారు. దిక్కుతోచని అయోమయంలో పడిన బంధువులు మంత్రి నారాయణ దృష్టికి విషయం తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన మంత్రి నారాయణ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. నవీన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ వేమూరి రవి ,ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ కుమార్ లకు సమాచారం అందించి అండగా నిలవాలని ,అవసరమైన వైద్య చికిత్సతో పాటు ఇతర సాయం అందించాలని కోరారు. నవీన్ ఆరోగ్యపరిస్థితిని తెలుసుకొంటూ అందుతున్న వైద్యసహాయంపై మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు ఆరా తీసున్నారు .విషయం చెప్పిన వెంటనే స్పందించి నేనున్నానని భరోసా ఇచ్చి కొండంత అండ ఇచ్చిన మంత్రికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు .
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: