AP: విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత వేగంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అదే దిశగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ విశాఖలో ఒకేరోజు నాలుగు ఐటీ కంపెనీల శంకుస్థాపనలు చేసి నగరానికి కొత్త టెక్నాలజీ అవకాశాలు తెచ్చారు. ఈ సంస్థలు కలిపి రూ. 282.60 కోట్ల పెట్టుబడులు, 4,300కి పైగా ఉద్యోగావకాశాలు సృష్టించనున్నాయి.
Read also: Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల కేటాయింపు

Minister Lokesh laid the foundation stone for the companies.
ప్రధాన పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు
- Imaginnovate Tech Solutions – రూ. 140 కోట్లు పెట్టుబడి
- ఉద్యోగాలు: 2,600
- స్థలం: కాపులుప్పాడు, భీమిలి
- Tech Thammina – రూ. 62 కోట్లు
- ఉద్యోగాలు: 500
- స్థలం: మధురవాడ ఐటీ హిల్-2
- Non Rel Technologies – రూ. 50.60 కోట్లు
- ఉద్యోగాలు: 567
- స్థలం: మధురవాడ
- ACN Infotech – రూ. 30 కోట్లు
- ఉద్యోగాలు: 600
- 12 నెలల్లో ఆపరేషన్స్ ప్రారంభం
AP: ఈ కార్యక్రమాలకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌తో పాటు ఆయా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: