భవిష్యత్తు తరాలను అద్భుతంగా తీర్చిదిద్దాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) అన్నారు, ప్రభుత్వంతో చర్చించి, (AP) రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మాక్ అసెంబ్లీ (Mock Assembly) జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు, మంగళవారం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో జరిగిన ‘అమరావతి బాలోత్సవం’ లో సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Read Also: AP Government: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి

బాలోత్సవం లక్ష్యం మరియు మంత్రి ప్రశంసలు
విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యాసరచన, వక్తృత్వ, నృత్య, నాట్య, డ్రాయింగ్ పోటీలను మంత్రి స్వయంగా పరిశీలించారు, కాంతార, భరతమాత, రాణి రుద్రమదేవి, రైతు వేషధారణల్లో ఉన్న చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు, వేలాది మంది విద్యార్థులతో అమరావతి బాలోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను మంత్రి దుర్గేష్ ప్రశంసించారు.
ఈ సంవత్సరం అమరావతి బాలోత్సవం.. 8వ పిల్లల పండుగ ను ‘మంచి గాలి కోసం, మంచి జీవితం కోసం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అనే నినాదంతో నిర్వహించడం శుభ పరిణామమన్నారు, నేటి నుంచి మూడు రోజుల పాటు (9 నుండి 11వ తేదీ వరకు) నిర్వహిస్తున్న ఈ బాలోత్సవం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంత్రి సూచన
పిల్లల అభిరుచులు తెలుసుకొని, దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సైతం తమ బోధనా శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ విద్యార్థులను ఒకచోట చేర్చి, వారి మధ్య ఆటపాటలు, బృంద చర్చలు నిర్వహించడం వల్ల వారిలో స్నేహభావం, ఐకమత్యం, సమానత్వ విలువలు మెరుగుపడతాయన్నారు.
ప్రతి విద్యార్థికి చదువులతో పాటు కళలు, క్రీడలు, ఇతర అంశాల్లో ప్రావీణ్యం ఉంటుందని, తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దకుండా వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించాలని హితవు పలికారు. పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసినప్పుడే సమగ్ర వ్యక్తిత్వ వికాసం బయట పడుతుందని తెలిపారు.
విద్యార్థులే భవిష్యత్తుకు పునాది
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే అందరి లక్ష్యం కావాలన్నారు, విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తుకు పునాది అని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని మంత్రి దుర్గేష్ అన్నారు, క్రమశిక్షణ, పట్టుదల, విజన్ తో ముందుకు వెళ్తేనే అద్భుతాలు సృష్టించగలమని, ఈ క్రమంలో విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ మాజీ ఎంఎల్సి కె.ఎస్.లక్ష్మణరావు, సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: