ప్రముఖ యోగా, ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు (Dr. Manthena Satyanarayana Raju) తన ప్రభుత్వ పదవికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో సీఎం చంద్రబాబు.. మంతెన సత్యనారాయణ రాజును (AP) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ‘సంజీవని’ వంటి ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు ఆయన సలహాలు తీసుకోవాలని సీఎం భావించారు. ఈ నేపథ్యంలో మంతెనతో సీఎం చంద్రబాబు దాదాపు 20 నిమిషాల పాటు చర్చించి, పదవిని చేపట్టాలని కోరారు.
Read Also: Nellore Municipal Schools: నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్
అయితే, ఈ పదవిని స్వీకరించడానికి తాను మొదట విముఖత చూపినట్లు మంతెన తెలిపారు. కేవలం తెరవెనుక ఉండి సలహాలు ఇస్తానని చెప్పగా, అధికారిక హోదా ఉంటేనే సూచనలకు విలువ ఉంటుందని, పనులు వేగంగా జరుగుతాయని సీఎం చంద్రబాబు నచ్చజెప్పినట్లు వివరించారు. ముఖ్యమంత్రి కోరికను కాదనలేక పదవిని స్వీకరించడానికి అంగీకరించినప్పటికీ, తాను కొన్ని కఠినమైన షరతులు విధించినట్లు మంతెన పేర్కొన్నారు.
సదుపాయాలను తీసుకోను
దీనికి స్పందనగా మంతెన తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను ఏ హోదాలు, పోస్టులు తీసుకోకూడదనే నియమాన్ని పెట్టుకున్నానని వివరించారు. తాను వెనుక ఉండి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తానని, ప్రభుత్వ సహకారం ఉంటే తాను చేస్తున్న పనికి రెట్టింపు ఉత్సాహంతో, ఎక్కువ సమయాన్ని కేటాయించి సేవ చేస్తానని పేర్కొన్నారు. అయితే, హోదా లేకపోతే మాటలకు గౌరవం ఉండదని, ఆచరణలోకి వెళ్లదని, పదవిలో ఉండి చెబితే అమలుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యమంత్రి వివరించారు.

దీనివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో.. మంతెన తాను సలహాదారుగా ఉండాలంటే, క్యాబినెట్ హోదాతో వచ్చే ఏ సదుపాయాలనూ తాను తీసుకోనని స్పష్టం చేశారు. ఇందులో నెల జీతం, ప్రభుత్వ కారు, ఇతర ఖర్చులు, ఇంట్లో సహాయకుల జీతాలు, విమాన, రైలు టిక్కెట్లు, కార్యాలయ సదుపాయాలు వంటివి ఏవీ స్వీకరించనని స్పష్టం చేసారు. చివరకు మంతెన అభిప్రాయాలకు ముఖ్యమంత్రి అంగీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: