బంగాళాఖాతంలో మరో తుపాను (Rain) రూపుదిద్దుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మలక్కా జలసంధి మరియు మలేషియా సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం, రానున్న రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, 24 గంటల్లో అండమాన్ సముద్రంలో తీవ్ర వాయుగుండంగా మారనుంది.
వాయుగుండం తుపానుగా ఎదిగితే దానికి ‘సెన్యార్’ అనే పేరు ఖరారు కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన ఈ పేరు ‘సింహం’ అనే అర్థం కలిగిందని ఐఎండీ తెలిపింది. అయితే తుపాను అధికారిక రూపం దాల్చిన తర్వాతే పేరు ప్రకటిస్తారు.
Read also: Petrol: ఇంధన పరిరక్షణ అవార్డులకు దరఖాస్తులు

Low pressure likely to develop into a cyclone
27, 28 తేదీల్లో మెరుపులు-ఉరుములతో
ఈ సంభవిస్తున్న వాతావరణ వ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాం పరిసరాల్లో నవంబర్ 29న భారీ వర్షాలు, 30న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే నవంబర్ 27, 28 తేదీల్లో మెరుపులు-ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరించింది.
తమిళనాడులో నవంబర్ 24 నుండి 30 వరకు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కేరళ మరియు లక్షద్వీప్ ప్రాంతాల్లో కూడా వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. అండమాన్ & నికోబార్ దీవుల్లో వచ్చే ఆరు రోజులపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: