శీతాకాలం నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గురుకులాలు, కేజీబీవీ హాస్టల్స్‌లో నివసిస్తూ చదువుకుంటున్న విద్యార్థులు తీవ్రమైన చలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం స్కూల్‌కు వెళ్లే సమయంలో చలి తీవ్రత వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి తల్లిదండ్రులతో పాటు విద్యా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
Read also: AP: రుషికొండకు కొత్త రూపు? లగ్జరీ టూరిజం హబ్‌గా మారనున్న భవనాలు

AP
ఈ అంశం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థుల ఆరోగ్యం అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న ఆయన, చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన దుప్పట్లు, వేడి నీటి సదుపాయాలు, నివాస వసతులు కల్పించాలని అల్లూరి జిల్లా కలెక్టర్‌ను కోరారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేస్తూ, ఈ మేరకు ‘X’ వేదికగా అధికారులకు సూచనలు జారీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: