నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్(AP Liquor) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలకు సంబంధించిన పనివేళలను ఎక్సైజ్ శాఖ పెంచుతూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
Read Also: TG: సంక్రాంతికి టోల్ ఫ్రీ హైవేపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

డిసెంబర్ 31, జనవరి 1న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు అనుమతి
డిసెంబర్ 31 మరియు జనవరి 1 తేదీల్లో మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ(AP Liquor) తెలిపింది. అదే విధంగా, బార్లు, ఇన్-హౌస్ లైసెన్సులు మరియు ఈవెంట్లకు ప్రత్యేక పర్మిట్ ఉన్న సంస్థలకు రాత్రి ఒంటి గంట వరకు మద్యం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, అలాగే అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటు సారా ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగానే అధికారిక పనివేళలను పొడిగించినట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: