ఏపీ మద్యం కుంభకోణంలో కొత్త పరిణామాలు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం(AP Liquor Scam) దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో భాగంగా నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(Chevireddy Bhaskar Reddy) మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి పేర్లతో ఉన్న ఆస్తులను జప్తు చేయడానికే ఆదేశాలు జారీ అయ్యాయి.
Read also: ఢిల్లీ ఆత్మాహుతి దాడిని బలిదానంగా అభివర్ణించిన అసదుద్దీన్ ఒవైసీ

చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు ప్రక్రియ
సిట్ (SIT) చెవిరెడ్డి కుటుంబం(AP Liquor Scam) అక్రమంగా భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ఈ కుటుంబం రూ. 54.87 కోట్లు నల్లధనంగా మార్చినట్లు వెల్లడైంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని విలువైన ఆస్తులను జప్తు చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. అవినీతి నిరోధక చట్టాల ప్రకారం, ఈ ఆస్తుల జప్తు ప్రామాణికతను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :