లిక్కర్ కేసులో ప్రభుత్వం సంచలన ఆదేశం
విజయవాడ : ఎపి లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీ
సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,(AP Liquor Scam) ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెవిరెడ్డి, ఆయన కుమారులు, బంధువుల పేరిట ఉన్న ఆస్తులపై చర్యలు రూ.54.87 కోట్ల నల్లధనం లావాదేవీలు జరిపినట్టు సిట్ గుర్తించింది. సిట్ సమాచారాన్ని అనుసరించి తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని ఆస్తులు ఉన్నాయి. వీటిని జప్తు చేయాలని సిట్ విజప్తి మేరకు హోం శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Read also: ధాన్యం సేకరించిన గంటలలోనే రైతుల ఖాతాలో సొమ్ము

సిట్ నివేదిక ఆధారంగా జిల్లాల్లో ఆస్తులపై చర్యలు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో(Chevireddy Bhaskar Reddy)పాటు ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, కెవిఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న చర, స్థిరాస్తులన్నింటినీ(AP Liquor Scam) జప్తు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని భూములు, ఇతర ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మద్యం కుంభకోణం ద్వారా చెవిరెడ్డి కుటుంబం అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిందని సిట్ తన విచారణలో గుర్తించింది. సుమారు రూ.54.87 కోట్ల నల్లధనాన్ని అధికార అండతో భూ లావాదేవీల ద్వారా మళ్లించినట్టు సిట్ నిర్ధారించింది. ఈ మేరకు సిట్ చేసిన విజప్తి ఆధారంగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలు ‘ చేపట్టాలని డిజిపిని ప్రభుత్వం ఆదేశించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: