ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Liquor) మద్యం విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. బార్లపై విధిస్తున్న 10 శాతం అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ (ARET)ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹340 కోట్ల మేర ఆదాయం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read Also: AP: ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

అయితే ఈ లోటును భర్తీ చేసే దిశగా మద్యం(AP Liquor) బాటిల్ ధరపై ₹10 పెంపు అమలు చేయనున్నారు. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి సుమారు ₹1,391 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
తక్కువ ధర మద్యం, బీర్లకు మినహాయింపు
సామాన్య వినియోగదారులపై భారం తగ్గించే ఉద్దేశంతో క్వార్టర్ ధర ₹99గా ఉన్న బ్రాండ్లతో పాటు బీర్లపై ధరల పెంపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 3 స్టార్ మరియు అంతకంటే పై స్థాయి హోటళ్లలో మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా పర్యాటక రంగం, హాస్పిటాలిటీ పరిశ్రమకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: