తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోనూ కీలక పత్రాలు స్వాధీనం
విజయవాడ : వైఎస్సార్సీపి హయాంలో ఎపిలో జరిగిన మద్యం కుంభకోణం అభియోగం కేసు విచారణలో ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడి) (ED) రంగంలోకి దిగింది. సిట్ సేకరించిన వివరాల ఆధారంగా తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కర్ణాటక, దిల్లీలోనూ సోదాల కొరడా ఝళిపించింది. ఏకకాలంలో 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఇడి అధికారులు తనిఖీలు చేస్తూ కీలకపత్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
ఢిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న మద్యం కుంభకోణా (Liquor scandal) ల్లో హవాలా కోణాలు వెలికితీసిన ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఎట్టకేలకు రాష్ట్రంలో వైఎస్సార్సీ హయాం లిక్కర్ స్కామ్ పైనా దృష్టిసారించింది. పిఎంఎల్ఎ చట్టం కింద కేసునమోదు చేసి దేశవ్యాప్తంగా ఏకకాలంలో 5 రాష్ట్రాల్లో ఆకస్మిక సోదాలు చేస్తోంది.
హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని
హవాలా మార్గాల్లో విదేశాలకు తరలిపోయిన నగదుతో పాటు ముడుపులతో కూడబెట్టిన ఆస్తులపై ఆరా తీస్తోంది. హైదరాబాద్ (Hyderabad) వెస్ట్ మారేడ్ పల్లిలోని వెల్లింగ్టన్ ఎంక్లేవ్లో వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసంలో దాదాపు 7 గంటలపాటు తనిఖీలు చేసిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహదేవ జువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్ కంపెనీల్లో విక్రాంత్ డైరెక్టర్గా ఉన్నారు.

ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి (Raj K.C. Reddy) ఆస్తులపై ఇడి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొత్తం 23 సూట్ కేసు కంపెనీల్లో లావాదేవీలపై ఇడి దృష్టి పెట్టినట్లు సమాచారం. సిట్ వేసిన ఛార్జిషీట్లోని నిందితుల ఆస్తులు, కంపెనీలపై దృష్టి సారించిన ఇడి హైదరాబాద్లో సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలపై ఆరాతీసినట్లు తెలుస్తోంది. పలు కంపెనీలకు ఇడి అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు.
కమీషన్లు ఇచ్చిన కంపెనీలకే అధిక ఆర్డర్లు
వైఎస్సార్సీపి హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు తెరిచి ప్రముఖ బ్రాండ్లన్నీ పక్కనపెట్టి జే బ్రాండ్లకు గేట్లేత్తారు. కొన్ని డిస్టిలరీలను హస్తగతం చేసుకుని రకరకాల పేర్లతో మద్యం ఉత్పత్తి చేయించారు. కమీషన్లు ఇచ్చిన కంపెనీలకే అధిక ఆర్డర్లు కట్టబెట్టారు. బెవరేజెస్ కార్పొరేషన్, నుంచి మద్యం సరఫరదారుకు బిల్లులు చెల్లించగానే మద్యం ముఠా తమ ముడుపులు వసూలు చేసుకునేవారు. ఈ ప్రక్రియంతా పక్కా కుట్రపూరితంగా జరిగిందని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది.
వైఎస్సార్సీ హయాంలో మద్యం మాటున దాదాపు రూ.3,500 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ మొత్తాన్ని డొల్ల కంపెనీలు, బినామీ సంస్థల ద్వారా మళ్లించినట్లు ఛార్జిషీట్లలో పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ముతో కొందరు స్థిరాస్తి వ్యాపారాలు చేయగా మరికొందరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటివరకూ 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. మద్యం ముడుపులను విదేశాలకు హవాలామార్గంలో తరలించారనే కోణంలో ఇడి రంగంలోకి దిగింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: