రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ ఆదేశం ఏలూరు : కొల్లేరు (kolleru lake) అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిఫుల్ కన్జర్వేటర్ డా. పి.వి. చలపతిరావు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల అటవీ, రెవిన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కొల్లేరు అభయారణ్యం, సుప్రీం కోర్ట్ ఏర్పాటుచేసిన కేంద్ర సాధికార కమిటీ కొల్లేరు అభయారణ్యంలో కొన్ని అంశాలపై నివేదికలు కోరిన అంశాలపై అధికారులతో చలపతిరావు సమీక్షించారు.

AP: కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించాలి
Read also: AP: త్వరలోనే ఎన్టీఆర్ బేబీ కిట్లు
ఈ సందర్భంగా చలపతి రావు మాట్లాడుతూ కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను అభయారణ్యం రూపొందించినప్పుడు ఉన్న రికార్డులతో ప్రస్తుతం ఆధునిక లిడార్ సర్వే టెక్నాలజీ ద్వారా గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో జిరాయితీ, డి. ఫారం పట్టా భూములు వివరాలతో పాటు, ఇటీవల కొల్లేరు ప్రాంతంలో పర్యటించిన సుప్రీంకోర్ట్ నియమించిన కేంద్ర సాధికార కమిటీ కొల్లేరు అభయారణ్యంపై కొన్ని అంశాలపై నివేదికలు సమర్పించాల్సిందిగా ఆదేశించిందని, వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి వాటిపై నివేదికలను వెంటనే సమర్పించాలని డా.చలపతి రావు అధికారులను ఆదిదేశించారు.
ఉప్పుటేరు సరిహద్దులను గుర్తించి
కొల్లేరు ప్రాంతంలో నీటి నిర్వహణకు బాధ్యత వహించే నీటి పారుదల శాఖ కొల్లేరు సరస్సు ప్రాంతం వివరణాత్మక కాంటూర్ మ్యాప్ లను అందించాలని ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీరన్ను డా. చలపతిరావు ఆదేశించారు. ఉప్పుటేరు సరిహద్దులను గుర్తించి నివేదికలు సమర్పించాలని, దీని కారణంగా కొల్లేరు ప్రాంతంలో వరదలను నియంత్రించేందుకు ఆక్రమణలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు అభిషేక్ గౌడ, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా అటవీ శాఖాధికారి బి. విజయ, ఏలూరు జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వర రావు, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శేషుబాబు, ఎస్ఈ దేవప్రకాష్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమేష్, డిపిఓ అనురాధ, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ త్రినాథ్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: