(AP) రాష్ట్రం ప్రభుత్వం మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం 2.50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. (AP) రాష్ట్రంలో తల్లి, బిడ్డల మరణాలను తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘కిల్కారి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలకు వారి ఆరోగ్య సంరక్షణకు సంబంధించి సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ సేవలు సెల్‌ఫోన్‌లో మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు.
Read Also: Tadipatri News: తాడిపత్రి పట్టణంలో యువకుడి ఆత్మహత్య
తెలుగుతో పాటు మరో 13 భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) కాల్స్ ద్వారా, రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలకు అందించే ఈ ఆరోగ్య సూచనలపై క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శాఖ కమిషనర్, వైద్య బృందాలు, డీఎంహెచ్‌వోలను ఆదేశించారు.వైద్యారోగ్య శాఖ కమిషనర్ కీలక ప్రకటన చేశారు. కిల్కారి కార్యక్రమం ద్వారా.. రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 2.50 లక్షల మంది గర్భిణులు,

తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం
బాలింతలతో పాటు వారి కుటుంబాలకు ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన కల్పిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎన్‌ఎంలు, ఆర్‌సీహెచ్ పోర్టల్‌లో గర్భిణుల వివరాలు, వారి సెల్‌ఫోన్ నంబర్లు నమోదు చేసిన తర్వాత, పుట్టిన బిడ్డకు ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు ప్రతి నెలా ఆడియో కాల్స్ వెళ్తాయి. ఈ కాల్స్ ద్వారా.. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ, వారికి అందించాల్సిన సరైన పోషణ, టీకాల ప్రాముఖ్యతతో పాటు..
కుటుంబ నియంత్రణ పద్ధతులు, మాతాశిశు మరణాలను నివారించే మార్గాలపై 1600403660 నంబరు ద్వారా ఆరోగ్య సంరక్షణ సూచనలు అందిస్తారు. ఒకవేళ కాల్ వచ్చినప్పుడు స్వీకరించలేకపోతే.. తిరిగి కాల్ 14423 లేదా 18005321255 కాల్ చేసి.. వీటి ద్వారా ఆ సమాచారాన్ని వినే వెసులుబాటు కూడా కల్పించాము అని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: