ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ పరిపాలనలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం, వాటి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడం లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ (AP Cabinet) సమావేశంలో పలు కీలక సంస్కరణలను ఆమోదించింది. ఈ నిర్ణయాలతో గ్రామ పంచాయతీ వ్యవస్థలో కొత్త దశ ప్రారంభమవనుంది.
AP Weather:ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు
ఇప్పటివరకు రాష్ట్రంలో అమలులో ఉన్న క్లస్టర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థ కింద పలు గ్రామ పంచాయతీలు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పడినందున, స్థానిక ప్రజాప్రతినిధుల స్వతంత్ర నిర్ణయాధికారాలు పరిమితమయ్యాయి. అయితే, ఈ మార్పుతో మొత్తం 7,244 క్లస్టర్ల స్థానంలో ఉన్న 13,351 గ్రామ పంచాయతీలు ఇకపై స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా కొనసాగనున్నాయి.
ప్రభుత్వం ఈ పునర్వ్యవస్థీకరణ (reorganization) లో భాగంగా గ్రామ పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించేందుకు ఆమోదం తెలిపింది. జనాభా, ఆదాయం, అభివృద్ధి సూచీలు వంటి ప్రమాణాలను ఆధారంగా తీసుకొని ఈ గ్రేడ్లను నిర్ణయించనుంది. గ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల వినియోగం ఆధారంగా వాటిని క్రమం తప్పకుండా సమీక్షించనున్నట్లు సమాచారం.
10 వేలు జనాభా దాటిన పంచాయతీలను
10 వేలు జనాభా దాటిన పంచాయతీలను అర్బన్ పంచాయతీలుగా గుర్తించింది. వీటిల్లో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి.. వాటిని అర్బన్ పంచాయతీ లుగా రూపొందించనున్నారు. అలానే గ్రామ కార్యదర్శి హోదాను.. పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ)గా మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వీటితో పాటు పంచాయతీరాజ్‌లో ప్రత్యేకంగా ఐటీ విభాగం (IT Dept) ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.కొత్తగా తీసుకువచ్చిన సంస్కరణల ప్రకారం, గ్రామ పంచాయతీలను స్పెషల్, గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 అనే నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. పట్టణాలకు సమీపంలో.. మైదాన ప్రాంతాల్లో ఉండి.. కనీసం 10,000 జనాభా కలిగి ఉండి..
రూరల్ అర్బన్ పంచాయతీలుగా పరిగణిస్తారు
కోటి రూపాయల ఆదాయం ఉన్న పంచాయతీలను ఇక మీదట రూరల్ అర్బన్ పంచాయతీలుగా పరిగణిస్తారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో (agency areas) 5,000 జనాభా ఉన్న పంచాయతీలు కూడా ఈ కోవలోకి వస్తాయి. ఈ రూరల్ అర్బన్ పంచాయతీలు.. పురపాలికల మాదిరిగానే పాలనను కొనసాగిస్తాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 359 పంచాయతీలు ఈ పరిధిలోకి వస్తాయి.గ్రేడ్ 1 కిందకు వచ్చే పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న 359 మంది కార్యదర్శుల వేతనాల పెంపుతోపాటుగా వారికి డిప్యూటీ ఎంపీడీఓ హోదా కల్పించారు.
వీరిని రూర్బన్ పంచాయతీల్లో నియమించనున్నారు. అలాగే, 359 మంది జూనియర్ అసిస్టెంట్లకు.. సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇచ్చి రూర్బన్ గ్రేడ్ పంచాయతీల్లో నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనితో పాటు పంచాయతీ రాజ్ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: