ఆంధ్రప్రదేశ్ (AP)లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మరియు బెటర్‌మెంట్ పరీక్షల ఫలితాలు శనివారం, జూన్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి (BIEAP) ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. మే 12 నుంచి మే 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in ద్వారా చూసుకోవచ్చు. విద్యార్థుల సౌలభ్యం కోసం, మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు “HI” అని మెసేజ్ పంపడం ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే వెసులుబాటును కల్పించారు.

మార్చిలో జరిగిన సాధారణ ఇంటర్మీడియట్ పరీక్షల్లో
మార్చిలో జరిగిన సాధారణ ఇంటర్మీడియట్ పరీక్షలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు రెండో అవకాశాన్ని కల్పించాయి. అదేవిధంగా, ఇప్పటికే పాసై, తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థుల కోసం బెటర్‌మెంట్ పరీక్షలు నిర్వహించారు.మార్చిలో జరిగిన సాధారణ ఇంటర్మీడియట్ పరీక్షల్లోఒకటి లేదా ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం. ఈ సప్లిమెంటరీ పరీక్షలలో విజయవంతంగా ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇప్పుడు డిగ్రీ లేదా ఇతర ఉన్నత విద్యా కోర్సులలో ప్రవేశాలు పొందడానికి అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్(AP)లోని అనేక కళాశాలలు ఇప్పటికే ప్రవేశ ప్రక్రియలను ప్రారంభించినందున, విద్యార్థులు వీలైనంత త్వరగా అవసరమైన లాంఛనాలను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.పిల్లల ప్రగతిని సమీక్షించి, వారి అభిరుచులకు అనుగుణంగా ఉన్నత విద్యా కోర్సులు ఎంపిక చేయాలి. విద్యార్థులు త్వరగా నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
Read Also: Rajahmundry: ఈ నెల 19న అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కు