ఆంధ్రప్రదేశ్ (AP) లో మద్యం అమ్మకాల గణాంకాలు తాజాగా ఎంతో చర్చనీయాంశంగా మారాయి. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత మార్కెట్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చిన తరువాత సేల్స్ పెరిగాయి. రూ 99 లిక్కర్ అందుబాటులోకి వచ్చింది. బ్రాండెడ్ మద్యం (alcohol) తిరిగి ప్రవేశ పెట్టారు. అయితే, తొలి ఏడాది కంటే ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో అమ్మకాలు పెరిగినా.. ఆదాయం మాత్రం కిందటి ఏడాదితో పోల్చితే తగ్గింది. అదే విధంగా ప్రస్తుతం దీక్షల ప్రభావం సైతం మద్యం అమ్మకాల పైన పడింది.
Read Also: AP Schools: ఆంధ్రా స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్
దీంతో.. లెక్క మారింది. ఏపీ (AP) లో మద్యం అమ్మకాల్లో సాధారణంగా ప్రతీ ఏటా ఏటా 8 నుంచి 10శాతం వరకు వృద్ధి రేటు నమోదవుతుంది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5శాతానికే పరిమితమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 8 నెలల్లో రూ.19,268 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20,216 కోట్ల మద్యం విక్రయించారు. గతేడాదితో పోలిస్తే అమ్మకాల విలువ 5 శాతం పెరిగింది.
పరిమాణం పరంగా చూస్తే లిక్కర్ 6శాతం, బీరు 24శాతం అమ్మకాలు పుంజుకున్నాయి. అయితే, మార్కెట్‌లోకి రూ.99 లిక్కర్ బ్రాండ్లు రావడం, కూటమి ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించడంతో అమ్మకాలు పెరిగిన స్థాయిలో వాటిపై ఆదాయం పెరగలేదు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గినట్లు ప్రస్తుత లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో తొలి ఎనిమిది నెలల్లో నెలకు సగటున రూ.2,527 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.

రూ.30 వేల కోట్ల మద్యం అమ్మకాలు
రెండు నెలల కిందటి వరకు అమ్మకాల్లో జోరు కనిపించింది. నకిలీ మద్యం తెరపైకి వచ్చాక బెల్టు షాపులు పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఒక్క అక్టోబరులోనే రూ.430 కోట్ల మేరకు అమ్మకాలు తగ్గాయి. 2024తో పోలిస్తే ఈ ఏడాది నవంబరులో అమ్మకాలు రూ.46 కోట్లు తగ్గాయి.
మొత్తంగా ఎనిమిది నెలల్లో గతేడాదితో పోలిస్తే రూ.948 కోట్ల మేర అమ్మకాలు పెరిగాయి. 2024-25లో సుమారు రూ.30 వేల కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ఏడాది మరో నాలుగు నెలలు ఉండగా రూ.20 వేల కోట్లు దాటింది. దీంతో సగటు అమ్మకాలను పరిశీలిస్తే మిగిలిన నెలల్లో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ.30 వేల కోట్లు దాటుతాయనే అంచనా ఉంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: