ఆంధ్రప్రదేశ్(AP) చంద్రబాబు నాయుడు తానే అన్నీ చేశానని చెప్పుకోవడం ఆయనకు మామూలే. ఎక్కడ ఏ అభివృద్ధి పనులు ఉన్నా వాటికన్నింటికి తానే కారణం అంటుంటారు. తాజాగా హైదరాబాద్ బిర్యానీని ప్రపంచానికి తానే ప్రమోట్(Promote) చేశానని చంద్రబాబు వ్యాఖ్యానిచ్చారు.
Read Also: Delhi Blast: రూమ్ నెంబర్ 13 లో డాక్టర్లు ప్రణాళికలు

ఎయిర్ పోర్ట్ను నేనే కట్టాను
విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో పాల్గొన్న చంద్రబాబు(Chandrababu) ఓల్డ్ సిటీ పక్కనే ఎయిర్ పోర్ట్ ను (Airport) నేనే కట్టానని చంద్రబాబు అన్నారు. ఇతర ప్రాంతాల వాళ్లు ఓల్డ్ సిటీ వెళ్లి షాపింగ్ చేసేలా ముత్యాలను నేనే ప్రమోట్ చేశానని బాబు చెప్పుకొచ్చారు.
నేను చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్ లో ముస్లింలు కోటీశ్వరు అయ్యారని బాబు చెప్పారు. అంతేకాకుండా వర్స్ బోర్డు చట్టంలో కేంద్రం సవరణలు తెచ్చినా ఏపీలో మాత్రం మైనార్టీ సోదరులనే పెట్టి వారి ఆస్తులను కాపాడానని చంద్రబాబు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: