ఉత్తరాంధ్రపై బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను దద్దరిల్లిస్తోంది. విశాఖపట్నం Visakhapatnam నగరంలో బలమైన ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. విశాఖ జీవీఎంసీ కార్యాలయం లోని పెద్ద వృక్షం గాలుల ధాటికి కూలిపడి, పార్కింగ్ లో ఉన్న లారీపై పడింది. అదృష్టవశాత్తు కార్యాలయంలో ఈ రోజు సెలవు ఉండడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. అలాగే, విశాఖ ఆకాశవాణి రేడియో కేంద్రం పరిసరాల్లోనూ మరో పెద్ద చెట్టు నేలకొరిగింది. ఈ గాలుల కారణంగా రోడ్లపై చెట్లు పడిపోయి, కొంత భాగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీవీఎంసీ, GVMC విపత్తు నిర్వహణ సిబ్బంది వెంటనే యంత్రాల సాయంతో చెట్లను తొలగిస్తూ సహాయక చర్యలు చేపట్టారు.
AP Government: చిన్న కాంట్రాక్టర్‌లకు శుభవార్త.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

Visakhapatnam
వజ్రపుకొత్తూరు మండలం,
శ్రీకాకుళం జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. వజ్రపుకొత్తూరు మండలం, హుకుంపేట, గునుపల్లి ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు చేరింది. పలు ప్రాంతాల్లో స్థానిక అధికారులు ఫైరింజన్లు, ఇతర సహాయక బృందాలను పంపి పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు. అల్లూరి జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో జనజీవనం స్తంభించిపోయింది. జి.మాడుగుల కొత్తపల్లి జలపాతం ఉద్ధృతంగా మారింది. పర్యాటకులకు జలపాతాల వద్దకు వెళ్లవద్దని, కల్వర్టులు, వంతెనల ద్వారా వాగులు దాటవద్దని అధికారులు హెచ్చరించారు. అరకు-విశాఖ ఘాట్ రోడ్డులోనూ చెట్లు విరిగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉత్తరాంధ్రలో ఏమి జరిగింది?
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం (సైక్లోన్) కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, బలమైన గాలులు, కొంతమంది ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలు ఏవి?
విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. అక్కడ చెట్లు కూలడం, విద్యుత్ సరఫరా అంతరాయం, ఇళ్లలోకి నీరు చేరడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: