ఆంధ్రప్రదేశ్ (AP) తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.ఈసారి సొంత పార్టీ నేతపైనే అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (AP) హోం మంత్రి వంగలపూడి అనితను నేరుగా టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పడు కష్టపడ్డామన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఇప్పుడు తమ గన్ లైసెన్సులను కూడా రెన్యువల్ చేయించుకోలేని పరిస్థితి అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: AP: దావోస్ పర్యటన తర్వాత SLBC సమావేశంలో సీఎం సమీక్ష

నా పరిస్థితే ఇలా ఉంటే కార్యకర్త పరిస్థితి ఏమిటి
తాను, తన కొడుకు గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం హోం మంత్రి అనితకు ఎన్నో లేఖకు రాశామని.. కానీ పట్టించుకోవడం లేదన్నారు. హోం మంత్రి అనిత తనను, ఎమ్మెల్యేను అవమానిస్తున్నారని, అన్నారు. తమ పరిస్థితే ఇలా ఉంటే కార్యకర్తల పరిస్థితి ఏమిటని జేసీ ప్రశ్నించారు. ” నేనే ఉదాహరణ. నాకు ఈ రోజు గన్‌మెన్లు లేరు. నేను హోం మంత్రికి చెప్తున్నా. మీకు ఎన్నిసార్లు లెటర్లు రాసినా పట్టించుకోలేదు.
మీరు నన్ను అవమానిస్తున్నారు. ఎమ్మెల్యేను అవమానిస్తున్నారు. నా మాటలతో ఎవరైనా బాధపడొచ్చు. మాకు కూడా బాధలు ఉంటాయి. అనితమ్మా.. మరి నాది తప్పో, నీది తప్పో పోలీసుల తప్పో తెలీదు.. కానీ ఇది ఎమ్మెల్యేకు అవమానం. గన్ లైసెన్సులు కూడా రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి. నా పరిస్థితే ఇలా ఉంటే కార్యకర్త పరిస్థితి ఏమిటి” అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: